ఆకాశమంత ఎత్తుకు భారత్ ఖ్యాతి.. పాకిస్థాన్‌కి ఘోర అవమానం దేశవ్యాప్తంగా అందరూ 77 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాని మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు సందేశానిచ్చారు.
ఇదే సమయంలో దేశ ఖ్యాతిని ఆకాశమంత ఎత్తుకు చేర్చారు. ఆగస్టు 15 అర్ధరాత్రి 12 గంటలకు దుబాయ్‌లోని బుర్జ్‌ఖలీఫా బిల్డింగ్‌పై ఎల్ ఈడీ లైట్లతో భారత్ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఒక్క సారిగా దేశ భక్తి ఉప్పొంగిన ఆ క్షణాల్లో జాతీయ గీతాన్ని కూడా బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వెనుదిరిగిన పాకిస్థాన్ ప్రజలు…
ఇండియా కంటే ఒక రోజు ముందు అంటే ఆగస్టు 14న స్వాతంత్ర్య వేడుకలను జరుపుకున్న పాకిస్థాన్‌కి దుబాయిలో ఘోర అవమానం జరిగింది. స్వాతంత్య్ర వేడుకలను జరుపుకునే దేశాల జెండాలను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శిస్తుంటారు.
దీంతో పాకిస్థానీయులు కూడా తమ దేశ జెండాను భవనంపై చూసుకునేందుకు తరలివచ్చారు. అర్ధరాత్రి దాటినా తమ దేశ జెండా కనిపించకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురయ్యారు. అక్కడ దయాది దేశ ప్రజలు గుమిగూడిన వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.
అదే సమయంలో భారత్ జెండా రెపరెపలాడటం పాక్‌కి ఘోర అవమానంగానే చెబుతున్నారు నిపుణులు.
©️ VIL Media Pvt Ltd.