ఇండిపెండెన్స్ డే బంపరాఫర్.. ఉచితంగానే ఫోన్ పొందండి, ఈ ఒక్క రోజే!

Phone Offer | ఇండిపెండెన్స్ డే బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఉచితంగానే ఫోన్ పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ఈ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఫ్రీ గానే ఫోన్ (Phone) సొంతం చేసుకోవచ్చు. ఈ ఉచిత ఫోన్ ఆఫర్ కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అందువల్ల కొత్త ఫోన్ (Smartphone) ఉచితంగా పొందాలని భావించే వారు ఈ డీల్ వెంటనే సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ అందరికీ అందుబాటులో లేదు.

ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ చెయిన్ కంపెనీ టచ్ మొబైల్స్ సూపర్ డీల్ అందుబాటులోకి తెచ్చింది. ఫ్రీ ఫోన్ ఆఫర్ తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఉచితంగానే ఫోన్ పొందొచ్చు. 1947 ఆగస్ట్ నెలలో పుట్టిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున పైన పేర్కొన్న సంవత్సరపు నెలలో పుట్టిన వారు ఈ రోజు దగ్గరిలోని టచ్ మొబైల్ రిటైల్ స్టోర్‌కు వెళ్లి ఆఫర్ సొంతం చేసుకోవచ్చు.

శుభవార్త.. గ్యాస్ సిలిండర్‌ ఇప్పుడే బుక్ చేస్తే రూ.500 తగ్గింపు!

టచ్ మొబైల్ స్టోర్‌కు వెళ్లే వారు ఆధార్ కార్డు వెంట తీసుకువెళ్లాలి. డేట్ ఆఫ్ బర్త్ చూపించి ఉచిత ఫోన్ ఆఫర్ పొందొచ్చు. ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత ఫోన్ తీసుకువెళ్లొచ్చు. ఆగస్ట్ 15 ఒక్క రోజు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. అంతేకాకుండా టచ్ మొబైల్స్ బ్రాండెడ్ ఫోన్లపై ఏకంగా 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే ఇతర యాక్ససిరీస్‌పై 77 శాతం తగ్గింపు అందుబాటులో ఉంచింది.

మహిళలకు మోదీ అదిరే శుభవార్త.. కీలక ప్రకటన!

ఒప్పొ స్మార్ట్‌ఫోన్లపై 15 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఉందని పేర్కొంటోంది. అలాగే కేవలం రూ. 6,999కే 32 ఇంచుల ఎల్ఈడీ టీవీ కొనుగోలు చేయొచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. మీరు ప్రైవేట్ రంగ దిగ్గజ బ్యాంక్‌గా కొనసాగుతూ వస్తున్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఈజీ ఇన్‌స్టాల్‌మెంట్లలో జీరో వడ్డీ రేటుతో కూడా అడ్వాన్స్డ్ మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు. కాగా ఈ ఆఫర్లు అన్నీ సొంతం చేసుకోవాలని భావించే వారు దగ్గరిలోని టచ్ మొబైల్స్ షోరూమ్‌కు వెళ్లి ఈ రోజు డీల్స్ పొందొచ్చు. ఉచిత ఫోన్‌తో పాటు చౌక ధరకే టీవీ, ఇతర ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *