Airtel News | ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు వివిధ రకాల సర్వీసులు అందిస్తోంది. వీటిల్లో బ్రాడ్‌బాండ్ సర్వీసులు కూడా ఉన్నాయి. ఎయిర్‌టెల్ (Airtel) బ్రాండ్ సర్వీసులు తక్కువ ధరకే పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఎయిర్‌టెల్ బ్రాడ్ బాండ్ ప్లాన్స్‌ను (Plan) గమనిస్తే.. ధర రూ. 199 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ప్లాన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ రూ. 199 బ్రాడ్ బాండ్ ప్లాన్ విషయానికి వస్తే.. ఈ ప్లాన్ 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో డేటా అందిస్తుంది. ఈ ప్లాన్2ను 5 నెలల వరకు టెన్యూర్‌తో తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ ప్లాన్ ఎంచుకుంటే కంపెనీ ఉచితంగానే వైఫై రూటర్ కూడా అందిస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఈ ప్లాన్ రేటు రూ. 1674గా ఉంటుంది. ఇందులో రూ. 500 వన్‌టైమ్ ఇన్‌స్టాలేషన్ చార్జీలు, జీఎస్‌టీ వంటివి కలిసి ఉంటాయి.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన 5 బ్యాంకులు.. ఈ నెలలో..
అలాగే కంపెనీ రూ. 399 ప్లాన్ కూడా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ ద్వారా కూడా 10 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెట్ పొందొచ్చు. ఉచిత వైఫై రూటర్, ఎక్స్‌ట్రీమ్ బాక్స్, 350కి పైగా టీవీ ఛానల్స్ వంటివి పొందొచ్చు. ఈ ప్లాన్ ఎంచుకున్నా కూడా వన్ టైమ్ ఇన్‌స్టాలేషన్ చార్జీ కింద రూ. 500 చెల్లించాలి. ఐదు నెలల వరకు ప్లాన్ తీసుకోవాలి. దీని కోసం రూ. 3 వేలు కట్టాల్సి ఉంటుంది. అపరిమిత వాయిస్ కాలింగ్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు.
కస్టమర్లకు భారీ శుభవార్త అందించిన బ్యాంక్.. ఇండిపెండెన్స్ డేకి అదిరిపోయే గుడ్ న్యూస్!
అందువల్ల మీరు ఎయిర్‌టెల్ బ్రాడ్ బాండ్ సర్వీసులు పొందాలని భావిస్తే.. ఈ ప్లాన్ ఎంచుకోవచ్చు. తక్కువ ధరలో పలు రకాల సర్వీసులు పొందొచ్చు. అన్ని రకాల ఫెసిలిస్ లభిస్తున్నాయి. రూ. 199 ప్లాన్ కన్నా రూ. 399 ప్లాన్ ద్వారా ఇంకా ఇతర సర్వీసులు పొందొచ్చు. టీవీ ఛానల్స్ వీక్షించొచ్చు. అందువల్ల మీరు బ్రాడ్ బాండ్ సర్వీసులు పొందాలని భావిస్తే.. ఈ ప్లాన్స్‌ను పరిశీలించొచ్చు. ఒక్క ప్లాన్ ద్వారా పలు రకాల ఆఫర్లు పొందొచ్చు. వాయిస్ కాలింగ్, డేటా, టీవీ ఛానల్స్ ఇలా అన్నింటినీ పొందొచ్చు. అందుకే మీరు ఈ సర్వీసులు పొందాలని భావిస్తే.. ఈ రెండు ప్లాన్స్‌ను పరిశీలించొచ్చు. ఈ రెండింటినీ స్టాండ్ బై ప్లాన్స్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా ఇతర ప్లాన్స్ కూడా ఉన్నాయి.