హుజూరాబాద్ (జమ్మికుంట), ఆగస్టు 14: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం న్యూ ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగే పతాక ఆవిషరణ వేడుకల్లో పాల్గొనాలని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్, జమ్మికుంట ఎన్‌ఎంసీలో వడుకు కార్మికురాలిగా పనిచేస్తున్న మచ్చగరి శోభకు ఆహ్వానం అందింది. 17 ఏండ్లుగా పోలీ వస్త్ర ఖాదీ దారం వడుకు కార్మికురాలిగా ఆమె పనిచేస్తున్నారు.
పతాక ఆవిషరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు శోభతోపాటు ఆమె భర్త మచ్చగరి కుమారస్వామి, ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషనర్ ఆశు కుమార్‌కు ఆహ్వానం అందగా వారు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వావిలాల ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్ఠాన్ పాలక మండలి సభ్యులు, కార్మికులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.