ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. పక్కా ప్లాన్‌తో ముందుకు.. కస్టమర్లకు మరింత మెరుగైన సేవలు

SBI Branches: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. భారత్‌లో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా ఉంది. ఇది కస్టమర్ల నుంచి విశేష ఆదరణ పొందింది. కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసుల్ని ఎన్నో రకాలుగా అందిస్తున్న ఈ బ్యాంకు ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కొత్తగా ఈ సంవత్సరంలోనే మరో 300 బ్రాంచుల్ని తెరిచేందుకు ప్రణాళికలు వేస్తోంది. ప్రస్తుతం ఎస్‌బీఐకి దేశంలో 22,405 బ్రాంచులు ఉన్నాయి. అలాగే 235 ఫారెన్ బ్రాంచులు, ఆఫీసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా వస్తున్న 300 బ్రాంచులతో మొత్తం ఎస్‌బీఐ శాఖల సంఖ్య 23 వేలకు దగ్గరగా ఉండనుంది. బ్రాంచులు పెంచడంతో కస్టమర్లకు ఇంకా మెరుగ్గా సేవలు అందించవచ్చని బ్యాంక్ ఆలోచనగా ఉంది. ఈ నిర్ణయంతో మరింత ఎక్కువ మందికి కూడా ఎస్‌బీఐ సేవలు చేరనున్నాయి.

ఇదే సమయంలో ఎస్‌బీఐ ఛైర్మన్ దినేశ్ ఖారా కీలక వ్యాఖ్యలు చేశారు. డిజిటల్‌గా సేవలు విస్తరిస్తూనే.. భౌతికంగా కూడా కొత్త శాఖలు తీసుకురావడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించారు. ”మేం మా సేవలను డిజిటల్‌గా విస్తరించేందుకు కృషి చేస్తున్నాం. మరోవైపు అవసరం ఉన్న ప్రతి చోటా భౌతికంగా బ్రాంచుల్ని ఏర్పాటు చేయనున్నాం. ప్రస్తుత సంవత్సరంలో మరో 300 బ్రాంచుల్ని తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నాం. ఇది ప్రజల అవసరాన్ని బట్టి, డిమాండ్‌ను బట్టి ఎక్కడెక్కడ బ్రాంచుల్ని తెరవాలో ఆలోచిస్తాం.” అని చెప్పారు ఖారా.

అయితే ఎస్‌బీఐ కేవలం బ్రాంచులు, డిజిటల్ సేవలపై మాత్రమే కాదు.. బిజినెస్ కరస్పాండెంట్ల విస్తరణపైనా దృష్టి పెట్టిందని వివరించారు దినేశ్ ఖారా. కస్టమర్లకు ఏం కావాలో తాము అర్థం చేసుకోగలుగుతున్నామని.. అందుకు అనుగుణంగానే వారికి వాహకాలను ఏర్పాటు చేసి మెరుగైన సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కేంద్రం కీలక నిర్ణయం.. విండ్‌ఫాల్ టాక్స్ భారీగా పెంపు.. నేటి పెట్రోల్, డీజిల్ ధరలివే..

ఆర్‌బీఐ దూకుడు.. మరో 4 బ్యాంకులకు షాక్.. వీటిల్లో మీకు అకౌంట్ ఉందా చూసుకోండి మరి!

ఒకవైపు డిజిటల్‌గా విస్తరిస్తూనే, మరోవైపు అవసరమున్న చోట భౌతికంగా శాఖలను ఏర్పాటు చేసే విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖరా తెలిపారు. అలాగే, బిజినెస్‌ కరస్పాడెంట్ల విస్తరణపైనా దృష్టి పెట్టినట్టు ప్రకటించారు.

ఇక ఇటీవల SBI.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అదిరిపోయే లాభాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్- జూన్ త్రైమాసికానికి గానూ ఏకంగా రూ. 16,884 కోట్ల నికర లాభం నమోదు చేసింది. ఇక ఇదే క్రమంలో దేశంలోనే అత్యంత లాభదాయకమైన సంస్థగా అవతరించింది ఎస్‌బీఐ. గత పదేళ్లుగా ఈ స్థానం దిగ్గజ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ది కావడం విశేషం. ఈసారి ఆ స్థానం దిగ్గజ ప్రభుత్వ బ్యాంక్ సొంతమైంది.

2022 జులై నుంచి 2023 జూన్ వరకు రిలయన్స్ లాభం రూ.64,758 కోట్లు కాగా.. SBI నికర లాభం రూ.66,860 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో చూస్తే బ్యాంక్ నెట్ ప్రాఫిట్ రూ.6068 కోట్లు మాత్రమే. నిరర్ధక ఆస్తులు కూడా భారీగా తగ్గినట్లు ప్రకటించింది. లోన్లు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారని వివరించారు ఎస్‌బీఐ మేనేజింగ్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ ఛౌదరీ.

దివాలా అంచు నుంచి ఆర్థిక శక్తిగా.. 76 ఏళ్లలో భారత్ సాధించిన విజయాలివే..

కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన 5 బ్యాంకులు ఇవే.. ఒక్క నెలలోనే ఇలా చేశాయేంటి?

Read Latest

Business News and Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *