ఏ స్టార్ హీరోయిన్ అలా చేయదు.. శ్రీలీలపై నాగశౌర్య కామెంట్స్ వైరల్

ఏ స్టార్ హీరోయిన్ అలా చేయదు.. శ్రీలీలపై నాగశౌర్య కామెంట్స్ వైరల్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక హీరోయిన్ హవా నడుస్తోంది. హీరో ఎవరైనా సరే హీరోయిన్ మాత్రం ఆ బ్యూటీనే. తెలుగులో ఇప్పటివరకు తీసింది రెండు సినిమాలు మాత్రమే.. అందులో ఒకటి యావరేజ్ మూవీనే. అయినా సరే ఆ అమ్మడుకి మాత్రం టాలీవుడ్ లో యమ క్రేజ్ ఏర్పడింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు ధమాకా బ్యూటీ శ్రీలీల(Sreeleela). 

ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో దాదాపు 10 సినిమాలున్నాయి. అందులో టాలీవుడ్ టాప్ స్టార్ అందరూ ఉన్నారు. పవన్ కళ్యాణ్(Pawan kalyan), మహేష్ బాబు(Mahesh babu),బాలకృష్ణ(Balakrishna), విజయ్ దేవరకొండ(Vijay devarakonda),రామ్ పోతినేని(Ram pothineni), నితిన్(Nithin), వైష్ణవ్ తేజ్(Vaishnav tej), నవీన్ పోలిశెట్టి(Naveen polishetty).. ఇలా వరుసగా స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తోంది ఈ బ్యూటీ. అయితే తాజాగా ఈ అమ్మడి గురించి ఆసక్తికరమైన విషయం చెప్పుకొచ్చారు యంగ్ హీరో నాగశౌర్య(Naga shourya). 

నాగ శౌర్య హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ రంగబలి(Rangabali). మాస్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించింది. ఛలో(Chalo) తరువాత చాలా రోజులకి మంచి విజయాన్ని అందుకున్నాడు నాగశౌర్య. ఇందులో భాగంగా రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగశౌర్య లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో యాంకర్ అడుగుతూ.. మీరు నటించిన ఛలో సినిమాలో ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. ఫైనల్ గా రష్మిక(Rashmika)ను తీసుకున్నారు. ఇప్పుడు శ్రీలీల స్టార్ హీరోయిన్. దాని గురించి మీరు ఎం అనుకుంటున్నారు అని అడిగాడు. 

దానికి సమాధానంగా నాగశౌర్య.. శ్రీలీలను స్టార్ హీరోయిన్ స్థాయిలో చూడటం చాలా ఆనందంగా ఉంది. అవును ఛలో సినిమాకు ముందు శ్రీలీలనే అనుకున్నాం కానీ కుదరలేదు. మీకు తన గురించి ఇంకో విషయం చెప్తాను. ఇది శ్రీలీలకు కూడా తెలియదు. నేను ఒకేసారి బెంగళూరు నుండి ఫ్లైట్ లో వస్తుంటే అదే ఫ్లైట్ లో శ్రీలీల కూడా ఉంది. అదే సమయంలో ఒక ముసలావిడ ఫ్లైట్ ఎక్కారు.. ఆమె సీట్ వెనకాల చాలా దూరంలో ఉంది. అప్పుడు శ్రీలీల తన సీటు ఆ ముసలావిడకు ఇచ్చి తను వెళ్లి వెనకాల కూర్చుంది. నాకు తెలిసి స్టార్ హీరోయిన్ గా ఉన్న ఎవరు ఆ పని చేయరు కానీ తాను చేసింది. అంత మంచి మనసు ఉంది కాబట్టే శ్రీలీల ఈరోజు ఈ రేంజ్లో ఉంది అంటూ కామెంట్స్ చేశారు నాగశౌర్య. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *