తహశీల్దారు కార్యాలయంలోకి గొర్రెలను తోలారు

తహశీల్దారు కార్యాలయంలోకి గొర్రెలను తోలారు ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కురిచేడు తహసీల్దార్ కార్యాలయంలోకి వేలాది గొర్రెలను తోలి కాపరులు నిరసనకు దిగారు.  దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఈ వీడియోను చంద్రబాబునాయుడు పోస్ట్ చేశారు. 

ప్రకాశం జిల్లా  దర్శి నియోజకవర్గం కురుచేడు మండలం గొర్ల పాలెంలో గొర్రెల కాపరులు నిరసన తెలిపారు. గొర్రెలు మేతకు వెళ్లే కొండ పోరంబోకు భూమి ఆక్రమణకు గురి అయిందని గొర్రెల కాపరులు ఆరోపిస్తు్నారు. దీంతో గొర్రెల మేతకు కూడా కష్టం వస్తుందని  గొర్రెల కాపరులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఈ  ప్రభుత్వం అలసత్వం వీడి గొర్రెల పెంపకం దారుల సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

కాగా, సమస్యలను పరిష్కారించాలని తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోకపోవడంతో గొర్రెల కాపర్లు దాదాపు పదివేల గొర్రెలను తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి నిరసన తెలిపారు. అధికారులు ఇప్పటికైనా నిద్ర లేవాలని వారు డిమాండ్ చేశారు.

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *