ధనుష్‌కి జంటగా రష్మిక ఓవైపు సౌత్.. మరోవైపు బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక. తాజాగా ఆమె నటిస్తున్న సినిమాల లిస్ట్‌లో మరో కొత్త చిత్రం చేరింది. కోలీవుడ్ స్టార్ ధనుష్‌కి జంటగా ఆమె నటించబోతోంది.
ధనుష్‌తో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న చిత్రంలో హీరోయిన్‌గా రష్మికను ఫైనల్ చేశారు. సోమవారం ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. ‘ఈ ఆనందాన్ని అందరితో పంచుకోవడం చాలా ఎక్సైటింగ్‌గా ఉంది’ అంటూ ఇందులో తను నటించబోయే విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేసింది రష్మిక.
ధనుష్ కెరీర్‌లో ఇది 51వ చిత్రం. సోనాలి నారంగ్ సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలో తెలియజేస్తారు. ఇక ప్రస్తుతం పుష్ప 2, రెయిన్ బో చిత్రాలతో పాటు హిందీ చిత్రం ‘యానిమల్’లో నటిస్తోంది రష్మిక.
©️ VIL Media Pvt Ltd.