నా కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌

దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోత’. అభిలాష్‌ జోషి దర్శకుడు. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. ఈ వేడుకకు హీరోలు నాని, రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రానా మాట్లాడుతూ ‘ఈ సినిమా ట్రైలర్‌ చాలా బాగుంది. యాక్టింగ్‌ స్కూల్‌లో దుల్కర్‌ నా జూనియర్‌. తను మృదుస్వభావి. ప్రతీ విషయంలో క్రమశిక్షణతో ఉంటా డు. అతను పూర్తిస్థాయి యాక్షన్‌ సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అన్నారు.

నిజమైన పాన్‌ ఇండియా స్టార్‌కు నిర్వచనం దుల్కర్‌ సల్మాన్‌ అని, అతని కోసం దక్షిణాదితో పాటు హిందీ దర్శకులు కూడా కథలు సిద్ధం చేస్తున్నారని నాని తెలిపారు. దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ ఫిల్మ్‌ ఇది. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కించాం. ఈ సినిమా కోసం నాలుగు భాషల్లో డబ్బింగ్‌ చెప్పాను. నా తెలుగు వాయిస్‌ బాగా కుదిరింది. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు రొమాన్స్‌, ఎమోషన్స్‌ అన్నీ ఉంటాయి. గత ఏడాది కాలంగా ఈ సినిమా కోసం కష్టపడుతున్నా. నా డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ఇది. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *