‘నీతోనే డ్యాన్స్’ షో.. ‘రేస్ టూ ఫినాలే-2’ ప్రోమో అదిరిపోయింది. అసలే ఫినాలే దగ్గర పడటంతో జోడీలన్నీ డ్యాన్స్ కుమ్మేస్తున్నాయి. ఇక తాజా ప్రోమో అయితే రచ్చ రచ్చ చేసింది. గొడవలకి గొడవలు, డ్యాన్స్‌కు డ్యాన్స్, పెర్ఫామెన్స్‌కి పెర్ఫామెన్స్‌లతో జంటలన్నీ ఇచ్చిపడేశాయి. ప్రోమోలో సదా ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, నటరాజ్ మాస్టర్ గొడవ మాత్రం హైలెట్ అయ్యాయి. ఆ సంగతేంటో చూద్దాం.
సందీప్ గొడవ
ఆట సందీప్- జ్యోతి జోడి ఇండిపెండెన్స్ డే సందర్భంగా సూపర్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. అయితే వీళ్లకి అమర్ దీప్ 5 మార్కులు ఇవ్వడంతో రచ్చ మొదలైంది. “వదిన నువ్వు స్లిప్ అయ్యావ్..” అంటూ జ్యోతితో అమర్ చెప్పాడు. లేదు నేను అవ్వలేదు.. అంటూ జ్యోతి బుకాయించడంతో “లేదు వదిన నీటిగా తెలిసింది..” అంటూ అమర్ మరోసారి చెప్పాడు. దీంతో రెచ్చిపోయిన సందీప్.. అమర్‌పై ఫైర్ అయ్యాడు. “బ్రదర్ మాట్లాడేటప్పుడు కొంచెం ధిమాక్ యూజ్ చేయండి.. చేసి చెప్పేటప్పుడు ధిమాక్ యూజ్ చేయండి..” అంటూ సీరియస్ అయ్యాడు.
“10 ఇచ్చినప్పుడేమో మంచోళ్లం అయితాము.. మార్కు తగ్గిస్తే మాత్రం వెధవ అయిపోతాం..” అంటూ అమర్ కూడా ఫైర్ అయ్యాడు. “నేను గోల్డెన్ సీటు కోసం రాలేదు.. ఫైనల్‌లో నేనేంటో చూపిస్తాను..” అటూ సందీప్ ఛాలెంజ్ చేయండతో అమర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యాడు. “సందీప్‌కి డ్యాన్స్ అంటే ఎంత ప్రాణమో డ్యాన్స్‌తోనే చూపిస్తాను.. సంపీద్ మాస్టర్‌కి ఎంత పిచ్చో.. నాకు డ్యాన్స్ అంటే అంతే పిచ్చి.. ఆయన ఎట్లా సస్తాడో.. నేను అలానే అక్కడ సచ్చిపోతాను..” అంటూ ఇచ్చిపడేశాడు.
నటరాజ్-శ్రీముఖి
ఆ తర్వాత అసలు షోలో అందరికీ గొడవలు పెట్టే శ్రీముఖికి నటరాజ్ మాస్టర్ కరెక్ట్‌గా ఇచ్చాడు. నటరాజ్-నీతు జోడి అద్భుతంగా పెర్ఫామెన్స్ ఇచ్చిన తర్వాత శ్రీముఖి కావాలని నటరాజ్‌ను గెలికింది. “ఎలా అనిపించిది మాస్టర్ సొంత బయోపిక్ చేయడం.. నాకెందుకో ఆ టార్చర్ పెట్టే అమ్మాయి మీరు కాకుండా అంజలి అయి ఉంటే బాగున్ను అనిపించింది..” అంటూ గొడవ పెట్టేందుకు ట్రై చేసింది. దీంతో నటరాజ్ గట్టిగానే తగులుకున్నాడు. “ఎంతమందికి గొడవలు పెడతావ్ నువ్వు.. నీకు అసలు ఏం కావాలి చెప్పు.. ఏం కావాలి నీకు.. అసలు నాకు ఒక విషయం అర్థం కాలేదు.. అంటే మార్కులు తక్కువ రావాలని ప్లాన్ చేస్తున్నావా.. అసలు ఏంటి నీ ప్లాన్ చెప్పు..” అంటూ శ్రీముఖిపై సీరియస్ అయిపోయాడు.
సదా కేకలు
ఇక ప్రోమో చివరిలో అంజలి-పవన్ జోడి భయపెట్టి జడుసుకునేలా చేసింది. దెయ్యం పెర్ఫామెన్స్ చేసిన అంజలి-పవన్.. జడ్డీలను కూడా భయపెట్టేశారు. అసలే చాలా సెన్సిటివ్‌గా ఉండే సదా ఈ పెర్ఫామెన్స్ చూసి అళ్లిపోయింది. “ప్లీజ్ ఇలా చేయొద్దు.. ఇది చాలా సెన్సిటివ్.. దయచేసి నేను మిమ్మల్ని బెగ్ చేస్తున్నాను.. అంజలి ప్లీజ్ గో.. నేను చెబుతున్నాను.. ప్లీజ్.. స్టాప్ ఇట్.. ఇది ఆటలు కాదు” అంటూ గట్టిగా అరిచేసింది. మరి ఈ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి.
Read latest TV News and Movie Updates