కొందరు పచ్చిమిరపకాయలను ప్రతి కూరలో వేస్తుంటారు. నిజానికి ఇవి స్పైసీగా ఉండటమే కాదు వంటలను టేస్టీగా కూడా చేస్తాయి. అంతేకాదు ఇవి మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. ఎలాగంటే?
సాధారణంగా పచ్చి మిరపకాయలను మనం అన్ని రకాల ఆహారాల్లో వేస్తుంటా. పచ్చిమిర్చి మసాలా కోసం కూరలో చేర్చే మరో పదార్ధం. ఇది వంటలనే టేస్టీగా చేస్తుంది. కానీ చాలా మంది పచ్చిమిరపకాయలను కూడా కూరల్లోంచి కరివేపాకులా పారేస్తుంటారు. కానీన పచ్చిమిరపకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పచ్చిమిర్చిలో విటమిన్లు, రాగి, ఇనుము, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
పచ్చిమిరపకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పచ్చిమిరపకాయ ప్రోస్టేట్ సమస్యలను నయం చేస్తుంది. పచ్చిమిర్చిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని తింటే చర్మం ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మారుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీనిలో ఫైబర్ కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల జీర్ణక్రియ సులభం అవుతుంది.
గుండె, రక్తనాళాలు దెబ్బతినకుండా పచ్చిమిర్చి కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది రక్తనాళాలను బలోపేతం చేసి కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. అలాగే రక్తనాళాలు కుంచించుకుపోయే పరిస్థితి నుంచి కాపాడటానికి సహాయపడుతుంది.
పచ్చిమిరపకాయలు రక్త కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, ప్లేట్లెట్ సమీకరణను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఫైబ్రినోలైటిక్ కార్యకలాపాలను పెంచుతాయి. దీంతో ఇది రక్త ప్రవాహ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ ముక్కు, సైనస్ లలోని శ్లేష్మ పొరలను ఉత్తేజపరుస్తుంది. క్యాప్సైసిన్ చర్మం గుండా రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. శ్లేష్మం స్రావాన్ని పల్చగా చేస్తుంది.
ఒత్తిడి, నొప్పిని తగ్గించడానికి ఎండార్ఫిన్లు ఒక మూలకం. పచ్చిమిర్చి తినడం వల్ల శరీరంలో సహజంగా ఎండార్ఫిన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో మీ మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది.
విటమిన్ సి, బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండే పచ్చిమిర్చి మన కళ్లు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. పచ్చి మిరపకాయలు ఇనుము పుష్కలంగా ఉండే కూరగాయ. పచ్చిమిర్చిలో విటమిన్ కె కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే పచ్చిమిర్చి తినడం బోలు ఎముకల వ్యాధి చికిత్సకు ప్రయోజనకరంగా ఉంటుంది.