రాజస్థాన్‌లో మరో అంజూ ఘటన : భర్తను, పిల్లలను వదిలేసి.. ఇస్లాంలోకి మారి ప్రియుడి వెంట కువైట్‌కి

ప్రియుళ్ల కోసం పాక్ నుంచి భారత్‌కు వచ్చిన సీమా హైదర్.. అలాగే భారత్ నుంచి పాకిస్తాన్‌కు వెళ్లిన అంజూ ఘటనలు ఇరుదేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వీరు నిజంగా ప్రేమను దక్కించుకోవడానికి సరిహద్దులు దాటారా లేదంటే , నిఘా సంస్థల కింద పనిచేస్తున్నారా అనే అనుమానాలు ఇరు పక్షాల్లోనూ వున్నాయి. ఈ సంగతి పక్కనబెడితే.. వీరిద్దరి మాదిరే ఇంకొందరు దేశ సరిహద్దులను దాటినట్లుగా తెలుస్తోంది. కానీ వీటిలో చాలా వరకు బయటకు రాలేదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ కోవలోనే రాజస్థాన్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ తన ఇద్దరు పిల్లలు, భర్తను వదిలిపెట్టి మరో వ్యక్తితో కువైట్‌కు పారిపోయింది. 

రాజస్థాన్‌లోని దుంగార్‌పూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నగదు, నగలతో తన భార్య మరొక వ్యక్తితో కలిసి పారిపోయిందని భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీపికా పాటిదార్ తన స్నేహితుడు ఇర్ఫాన్ హైదర్‌తో కలిసి పారిపోయింది. ఆపై బురఖా ధరించి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దీపిక కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలిసినట్లుగా పీటీఐ నివేదించింది. ఈ కేసుకు.. తన స్నేహితుడిని కలిసేందుకు పాకిస్తనా్ వెళ్లిన అంజు అనే భారతీయ మహిళకు చాలా దగ్గరి పోలికలు వున్నాయి. 

రాజస్థాన్‌లోని భివాడి జిల్లాకు చెందిన అంజు ఈ ఏడాది జూలైలో 29 ఏళ్ల ఫేస్‌బుక్ స్నేహితుడు నస్రుల్లాను కలవడానికి పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌కు వెళ్లింది. ఆమెకు అప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ.. ప్రియుడి కోసం జూలై 21న కుటుంబాన్ని రాజస్థాన్‌లో వదిలి దేశ సరిహద్దులు దాటింది. తన స్నేహితుడిని కలవడానికి జైపూర్‌కు వెళ్తున్నట్లు భర్తకు చెప్పగా.. తన సోదరిని చూడటానికి గోవాకు వెళ్తున్నట్లుగా పనిచేస్తున్న కంపెనీకి సమాచారం అందించింది. 

ALso Read: పాకిస్థాన్‌లో ఫేస్‌బుక్ స్నేహితుడిని వివాహం చేసుకున్న భారతీయ మహిళ.. !

ఈ కేసులో దీపిక భర్త ముఖేష్ పాటిదార్ ముంబైలో పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు 11, 7 ఏళ్ల ఇద్దరు పిల్లలు వున్నారు. వైద్య చికిత్స కోసం తన భార్య తరచుగా గుజరాత్, ఉదయ్ పూర్‌కు వెళ్లేదని ముఖేష్ చెప్పాడు. జూలై 10న దీపిక.. తనకు అనారోగ్యంగా వుందని చెప్పి వైద్యం పేరుతో ఇంటి నుంచి గుజరాత్‌కు వెళ్లింది. అయితే జూలై 13 వరకు ఆమె తిరిగి రాలేదని ముఖేష్ వివరించాడు. దీనికి బదులుగా దీపిక తన భర్తకు వాట్సాప్‌ కాల్ చేసింది. అంతేకాదు.. రాజస్థాన్‌లోని ఇంటికి చేరుకున్న ముఖేష్‌కు ఇంట్లో దాచిన పది లక్షల నగదు, నగలు కనిపించలేదు. 

హైదర్ తన భార్యను బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మార్చాడని ముఖేష్ పాటిదార్ విలేకరులకు తెలిపాడు. హైదర్‌ను కలవడానికే దీపిక గుజరాత్‌లోని సబర్‌కాంతలోని ఖేడ్ బ్రహ్మను తరచుగా సందర్శించినట్లు పోలీసులు తెలిపారు. ఆపై హైదర్ ఆమెను కువైట్‌కు తరలించినట్లుగా తెలుస్తోంది. అయితే దీపికకు హైదర్‌తో ఎలా పరిచయం ఏర్పడింది, వీసాను ఎలా పొందింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *