LPG Cylinder Price | మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. కళ్లుచెదిరే డీల్ పొందొచ్చు. ఈ ఆఫర్ కేవలం పరిమిత కాలం వరకే అందుబాటులో ఉంటుంది. అందువల్ల సిలిండర్ (Cylinder) బుక్ చేసుకోవాలని భావించే వారు ఈ డీల్ వెంటనే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ గ్యాస్ (Gas) సిలిండర్‌పై ఎంత డిస్కౌంట్ వస్తంది? ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి? అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై ఏకంగా రూ. 500 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఈ ఆఫర్ కేవలం కొంత కాలం వరకే ఉంటుంది. మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అది కూడా ఆగస్ట్ 15న మాత్రమే ఈ డీల్ ఉంటుంది. అందువల్ల మీరు సిలిండర్ బుక్ చేసుకోవాలని భావిస్తే.. వెంటనే ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చు. తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ ఇంటికి తెచ్చుకోవచ్చు.
కస్టమర్లకు భారీ షాకిచ్చిన 5 బ్యాంకులు.. ఈ నెలలో..
ఇంతకీ ఈ ఆఫర్ ఎక్కడ ఉంది? అని అనుకుంటున్నారా? బజాజ్ ఫిన్‌సర్వ్ యాప్ ద్వారా ఈ ఆఫర్ పొందొచ్చు. ఈ యాప్‌లో మీరు సిలిండర్ బుక్ చేసుకుంటే రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇండేన్, హెచ్‌పీ, భారత్ గ్యాస్ ఇలా మీరు ఏ సిలిండర్ బుక్ చేసుకున్న ఆఫర్ అందుబాటులో ఉంటుంది. కేవలం ఒక యూజర్‌కు ఒకసారి మాత్రమే డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. మీరు ఏ పేమెంట్‌లో సిలిండర్ డబ్బులు కట్టినా కూడా ఆఫర్ వర్తిస్తుంది.
బంగారం రూ.2,550 ఢమాల్.. వెండి రూ.7,700 పతనం!
మీ ఇంట్లో ఖాళీ సిలిండర్ అందుబాటులో ఉంటే వెంటనే బుక్ చేసుకోండి. ఏకంగా రూ. 500 వరకు క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. బజాజ్ ఫిన్‌సర్వ్ ఆజాదీ సేల్ అందిస్తోంది. ఇందులో భాగంగా మీరు గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. టైమ్ దాటితే ఈ ఆఫర్ అందుబాటులో ఉండదు. అయితే కంపెనీ అప్పుడప్పుడు ఇలాంటి ఆఫర్లు తీసుకువస్తూనే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మిస్ అయినా తర్వాత ఆఫర్ వచ్చినప్పుడు సిలిండర్ బుక్ చేసుకోవచ్చు.
కాగా ప్రస్తుతం మార్కెట్‌లో గ్యాస్ సిలిండర్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్క సిలిండర్ ధర దాదాపు రూ. 1160 వరకు ఉంది. డెలివరీ చార్జీలు కలుపుకుంటే అప్పుడు సిలిండర్ ఇంటికి రావాలంటే రూ. 1200 చెల్లించుకోవాల్సిందే. చాలా కాలం నుంచే సిలిండర్ ధరలు అలానే గరిష్ట స్థాయిలో ఉంటూ వస్తున్నాయి. దిగి రావడం లేదు.