26 మంది సైనికుల మృతి..క్షతగాత్రుతో వెళ్తున్న హెలికాఫ్టర్​ కూల్చివేత

26 మంది సైనికుల మృతి..క్షతగాత్రుతో వెళ్తున్న హెలికాఫ్టర్​ కూల్చివేత అబుజా: నైజీరియా దేశం బందిపోట్ల గుప్పిట్లో చిక్కి విలవిల్లాడుతోంది. తాజాగా భద్రతా దళాలపై జరిపిన ఆకస్మిక దాడుల్లో 26 మంది సైనికులు మృతి చెందారు. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని రక్షించేందుకు వెళ్లిన హెలికాప్టర్​ గాయపడిన వారిని తీసుకుని వెళ్తుండగా ముష్కరుల దాడిలో కూలిపోయింది. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. 

నైజీరియాలో కొంతకాలంగా క్రిమినల్​ గ్రూపులు, సైనికులకు మధ్య పోరాటం జరుగుతోంది. ఆ దేశంలోని నైజర్, కడునా, జంఫారా, కట్సినా రాష్ట్రాల్లోని అడవుల్లో ఈ ముఠాలు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నాయి. కిడ్నాప్​లు, స్కూళ్లపై దాడులకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అడ్డొచ్చిన వారి ఇళ్లను దహనం చేస్తున్నాయి. ఈ క్రమంలో సెంట్రల్​ నైజీరియాలో సైనికులను ట్రాప్​ చేసి ఏకంగా వారిపై దాడులకు పాల్పడ్డారు.

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *