Cashew: మీ వంటల్లో జీడిపప్పు ఇలా వేసుకున్నారంటే రుచి అమోఘం

జీడిపప్పు అందరికీ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్. కానీ వీటిని తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని అపోహతో పక్కన పెట్టేస్తారు. నిజానికి వీటిని మితంగా తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో తినేందుకు ఇష్టం చూపిస్తారు. దీన్ని వంటల్లో అదనపు రుచి కోసం కూడా ఉపయోగిస్తారు. జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కూరలు అద్భుతమైన రుచిని కలిగి ఉండటం మాత్రమే కాదు గ్రేవీగా కూడా ఉంటుంది. వంటకాల్లో జీడిపప్పు ఉపయోగించుకునే కొన్ని మార్గాలు ఇవి.

క్రీమ్ నెస్ పెంచుకోవచ్చు

పంజాబీ వంటకం లేదా ప్రత్యేకమైన పనీర్ కూర ఏదైనా సరే జీడిపప్పు జోడించడం వల్ల క్రీముగా మంచి రుచిని అందిస్తుంది. వీటిని తరచుగా పంజాబీ గ్రేవీల్లో ఉపయోగిస్తారు. పేస్ట్ చేసుకునే ముందు కొద్ది సేపు నీటిలో నానబెట్టుకుని చేసుకుంటే బాగుంటుంది. క్రీమ్ రుచి, తీపి కోసం వంటలలో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు.

బిర్యానీ రుచి కోసం

దక్షిణ భారతదేశంలో బిసి బేలె భాత్ లేదా హైదరాబాద్ బిర్యానీ ఏదైనా జీడిపప్పు లేకుండా రుచి ఉండడు. వివిధ రకాల బియ్యం వంటకాలకి జీడిపప్పు అదనపు రుచిని అందిస్తుంది. బిర్యానీ, జీరా రైస్, పలావ్ ఇలా ఏ వంటకం అయినా తాళింపులో జీడిపప్పు ఖచ్చితంగా ఉండాల్సిందే.

మెరినేషన్

లడ్డూ, పాయసం, ఖీర్ ఇలా ఏ స్వీట్ చేసిన కూడా దీనికి గార్నిషింగ్ కోసం వేయించిన జీడిపప్పు వినియోగిస్తారు. చూసేందుకు ఆకర్షణీయంగా ఉంటాయి. రుచి కూడా క్రంచీగా అనిపిస్తుంది. జీడిపప్పు అలంకరణ లేకుండా ఎంత మంచిగా స్వీట్ చేసినా కూడా అది ఆకర్షించదు. ఇక నాన్ వెజ్ వంటకాలు, ఫ్రైస్, టిక్కాస్, కబాబ్ లో జీడిపప్పుని మసాలా దినుసులతో కలిపి వేయించి మెరినేషన్ కోసం కలుపుతారు.

సూప్ కోసం

అనేక సూప్, కూరల్లో పిండి స్థానంలో జీడిపప్పు ఉపయోగిస్తారు. కూరలు, సూప్ చిక్కగా చేయడానికి పిండి కలుపుతారు. అది ఇష్టం లేని వాళ్ళు జీడిపప్పు పేస్ట్ చేసుకుని కలుపుకోవచ్చు. లేదంటే జీడిపప్పు పొడి తయారు చేసి పెట్టుకుని దాన్ని జోడించుకున్నా కూడా రుచి అద్భుతంగా ఉంటుంది.

నమ్కీన్లు

అనేక నమ్కీన్లు, చివ్దాస్లోలో జీడిపప్పు వేయించి ఉప్పు, కారం, ఎండు మిర్చి కలుపుతారు. జీడిపప్పు కలపడం వల్ల వాటికి అదనపు రుచి వస్తుంది. వేయించిన జీడిపప్పుకి మసాలా, కారం జోడించుకుని స్నాక్స్ గా ఆరగించవచ్చు. ఇక బెల్లం పాకంలో జీడిపప్పు వేసుకుని అచ్చు మాదిరిగా చేసుకుని తింటే బాగుంటుంది. చిన్న పిల్లలకి రోజుకొక చిన్న ముక్క పెడితే మంచిది.

జీడిపప్పు ప్రయోజనాలు

పాలిఫెనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మృదువైన చర్మాన్ని అందజేస్తుంది. శరీరంలోని అన్నీ అవయవాల పనీతిరుకే కాకుండా చర్మం, వెంట్రుకలకు కావలసిన పోషణ అందిస్తుంది. ఇదే కాదు, మగవారిలో సంతానోత్పత్తికి అవసరమైన వీర్య కణాలను వృద్ధి చేసేందుకు కూడా సహకరిస్తుంది.

Also Read: లెమన్ టీ ఆరోగ్యానికి ఎంత హాని చేస్తుందో తెలుసా?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *