Low Cost Best Smartphone: మార్కెట్‌లో చాలా రకాల స్మార్ట్‌ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. డిజైన్, ఫీచర్లు చూస్తే ఒకదానిని మించి మరొకటి ఉన్నాయి. ఇందులో చాలావరకూ చైనా ఉత్పత్తులే. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ కూడా ఇలాంటిదే. ఇటీవలి కాలంలో ఆ ఫోన్ క్రేజ్ పెరుగుతోంది.
Low Cost Best Smartphone: అద్బుతమైన డిజైన్, ఫీచర్లు, కెమేరా కారణంగా మార్కెట్‌లో కొత్తగా ప్రవేశించే స్మార్ట్‌ఫోన్ కంపెనీలు మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాయి. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ నుంచి ఇటీవల కొత్త మోడల్ లాంచ్ అయింది. ఈ ఫోన్ కెమరా ఇతర ఫీచర్లు చూస్తే మీరు కూడా ఆగలేరు. ఆ వివరాలు తెలుసుకుందాం..
ఇన్‌ఫినిక్స్ స్మార్ట్‌ఫోన్ తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్లు అందిస్తుంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఇటీవలే అంటే ఆగస్టు నెలలో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ ఇన్‌ఫినిక్స్ జీరో 30 లాంచ్ చేసింది. ఇందులో ఫీచర్లు చూస్తే నోరెళ్లబెట్టడం ఖాయం. మీరు ఒకవేళ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇదే మంచి అవకాశం. ఇన్‌పినిక్స్ జీరో 30లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 60 డిగ్రీ కర్వ్డ్ 10 బిట్ ఎమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. దాంతోపాటు ముందూ, వెనుకా రెండువైపులా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది.
ఇన్‌ఫినిక్స్ జీరో 30 కెమేరా, బ్యాటరీ వివరాలు
ఇన్‌ఫినిక్స్ జీరో 30లో 108 మెగాపిక్సెల్ సూపర్ పవర్‌ఫుల్ ప్రైమరీ కెమేరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ సపోర్టెడ్ కెమేరా 1, 2 మెగాపిక్సెల్ మైక్రోసెన్సార్ మరొకటి ఉంటాయి. సెల్ఫీ , వీడియో కాలింగ్ కోసం ఇందులో ఏకంగా 60 మెగాపిక్సెల్ కెమేరా ఉంది. ఇన్‌ఫినిక్స్ జీరో 30 బ్యాటరీ సామర్ధ్యం కూడా చాలా ఎక్కువ. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. ఇన్ని సూపర్ ఫీచర్లు, అద్భతమైన కెమేరా కలిగిన ఇన్‌ఫినిక్స్ జీరో 30 స్మార్ట్‌ఫోన్ ధర కేవలం 15999 రూపాయలు మాత్రమే. ఇది 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో వస్తోంది.
Also read: Flipkart Smartphone Offers: శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా 5జి ఇప్పుడు సగం ధరకే, త్వరపడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitte , Facebook