Lucky Zodiac Sign: ఆగస్టు 17 నుంచి ఆగస్టు 31 వరకు ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు!

Sravana Masam Lucky Zodiac Sign: అధిక మాసం ముగిసి మళ్లీ శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పెట్టుబడులు పట్టడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి.

 

Sravana Masam Lucky Zodiac Sign: గత నెలలో ప్రారంభమైన అధికమాసం రేపటి అమావాస్యతో ముగియనుంది. దీంతో హిందువులకు అత్యంత ప్రాముఖ్యమైన శ్రావణ మాసం ప్రరంభం కానుంది. ఈ నెలలో నాగపంచమితో పాటు చాలా పండుగల ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఉపవాస వ్రతాలు కూడా మొదలవుతాయి. కాబట్టి ఈ నెలకు జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్య ఉంది. అయితే ఈ శ్రావణ మాసం ఆగస్టు 31 రాఖీ పౌర్ణమి రోజున ముగుస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం..ఆగస్టు 17 నుంచి ఆగస్టు 31 వరకు కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయట. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. 

ఈ రాశులవారికి ఆగస్టు 17 నుంచి ఆగస్టు 31 వరకు లాభాలే, లాభాలు!

మేష రాశి:

మేష రాశి వారు ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కొత్త వహనాలు, గృహాలను కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. పిల్లల నుంచి కూడా శుభవార్తాలు వింటారు. పోటీ పరీక్షలకు సిద్దమవుతున్నవారు ఊహించని లాభాలు పొందుతారు. అయితే వీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఖర్చులు తగ్గించుకునేందు పలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. 

వృషభ రాశి:

శ్రావణ మాసంలో వృషభ రాశివారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వీరు కూడా కొత్త వహనాలు కొనుగోలు చేయోచ్చు. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. అయితే ఈ క్రమంలో తండ్రి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే తీవ్ర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ప్రేమానుబంధాలు ఈ క్రమంలో మరింత మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ క్రమంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

కర్కాటక రాశి :

కర్కాటక రాశివారు శ్రావణ మాసంలో అన్ని రాశులవారి కంటే ఎక్కువ ప్రయోజనాలు పొందబోతున్నారు. ఈ క్రమంలో వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. అంతేకాకుండా కళాత్మక రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇక వ్యాపారాలు చేసేవారికి పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయంగా భావించవచ్చు. అయితే వీరు తప్పకుండా ఈ క్రమంలో ఆరోగ్యపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కాళ్ళకు గాయాలు లేదా నొప్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

సింహ రాశి:

శ్రావణ మాసంలో సింహ రాశి కూడా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణు తెలుపుతున్నారు. ఈ సమయంలో మనోబలం పెరగడం కారణంగా అనేక రకాల లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కొందరికీ తెలివితేటలు రెట్టింపు అవుతాయి. మాటతీరు పెరగడం కారణంగా సమాజంలో గౌరవం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రేమ బంధంలో ఆటంకాలు ఏర్పడే ఛాన్స్‌లు ఉన్నాయి. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. 

Also Read: Child Marriage: రూ.25 వేలకు ఆశపడి కూతురికి బాల్య వివాహం.. ట్విస్ట్ ఇచ్చిన బాలిక..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *