Rana Daggubati | మలయాళీ నటుడు దుల్కర్ సల్మాన్(Dulquer Salman) నటిస్తున్న తాజా చిత్రం కింగ్ అఫ్ కోత (King of Kotha). ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌కు టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి రానా (Rana), నాని(Nani)లు ఇద్దరూ గెస్టులుగా వచ్చారు. ఇక ఈవెంట్‌లో భాగంగా దుల్కర్ సల్మాన్ గురించి రానా గొప్పగా చెబుతూ.. ఓ బాలీవుడ్ హీరోయిన్‌పై విమర్శలు చేశాడు. ఒక హిందీ షూటింగ్‌లో భాగంగా దుల్కర్ ఓపికగా వెయిట్ చేస్తుంటే.. ఆ హీరోయిన్ మాత్రం లండన్‌లో ఉన్న భర్తతో షాపింగ్ గురించి మాట్లాడుతుంది. దాని వల్ల షూటింగ్ ఎఫెక్ట్ అయితున్న దుల్కర్ మాత్రం ఓపికగా తన పని తాను చేసుకున్నాడు. ఈ విషయంలో నేను నిర్మాతలని తిట్టానని రానా చెప్పుకోచ్చాడు.
దీంతో రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దుల్కర్‌ని ఇబ్బందిపెట్టిన ఆ బాలీవుడ్ హీరోయిన్ ఎవరా అని నెటిజెన్లు సెర్చ్ చేశారు. అయితే దుల్కర్‌ని ఇబ్బంది పెట్టింది సోనమ్ కపూర్ (Sonam Kapoor) అని అందుకే రానా ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కాస్తా వైరల్‌గా మారగా.. దీనిపై తాజాగా రానా ట్విట్టర్‌లో స్పందించాడు.
రానా మాట్లాడుతూ.. “నేను సరదాగా అన్న మాటల వల్ల సోనమ్ కపూర్ పైన కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు చూసి నేను ఆందోళన చేందుతున్నాను. స్నేహితులుగా మాకు మేము సరదాగా కామెంట్ల్ చేసుకుంటాము. అటువంటి విషయం ఇలా తప్పుగా జనాల్లోకి వెళ్లడం పట్ల నేను చింతిస్తున్నాను. ఈ విషయంలో సోనమ్‌కి, దుల్కర్‌కి నేను క్షమాపణలు చెప్పాలి అనుకుంటున్నాను. సోనమ్‌కి, దుల్కర్ ఇద్దరి మీద నాకు చాలా గౌరవం ఉంది. ఈ విషయం ఇక్కడితో ముగుస్తుందని ఆశిస్తున్నాను. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాని రానా ట్విట్టర్‌లో రాసుకోచ్చాడు.