Shani Dev: అధికమాస అమావాస్య రోజున ఇలా చేస్తే శని సాడే సతి వల్ల కలిగే నష్టాలన్నీ మాయం..

Adhika Masam Amavasya 2023: అధికమాస అమావాస్య రోజున ఇలా శివలింగాని పూజా కార్యక్రమాలు చేయడం వల్ల శని సాడే సతి సమస్యల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. 

 

Adhika Masam Amavasya 2023: అధికమాస అమావాస్య ఈ సంవత్సరం 16 ఆగస్టు రాబోతోంది. అమావాస్య రోజు విష్ణువును పూజించడం జీవితంలో మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అయితే ఈ రోజు చాలా మంది శివుడిని కూడా పూజిస్తారు. అధిక మాస అమావాస్య శ్రీమహ విష్ణువుతో పాటు శివుడిని పూజించడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుందని ఆనవాయితిగా వస్తోంది. అంతేకాకుండా ఈ రోజు శని దేవుడిని కూడా పూజిస్తారు. అయితే శని సడే సతి సమస్యలతో బాధపడేవారు అధికమాసంలోని అమావాస్య రోజున కొన్ని చర్యలు చేయడం వల్ల శని సడే సతి నుంచి విముక్తి లభిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

శని ధైయ, సాడే సతి ప్రభావం:

ప్రస్తుతం శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో తిరోగమన దశలో తిరుగుతున్నాడు. శని కుంభరాశిలో ఉండటం వల్ల కర్కాటక, వృశ్చిక వారిపై ప్రభావం పడుతుంది. అంతేకాకుండా మకర, కుంభ, మీన రాశుల వారురిపై శనీశ్వరుని సాడే సతి ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

శని సాడే సతి ఉన్నవారు ఇలా చేయండి:

✾ అధికమాసంలోని అమావాస్య రోజున శనిదేవునికి పూజా కార్యక్రమాలు చేసే క్రమంలో మంత్రాన్ని జపించడం వల్ల శని దేవుడి అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శని కారణంగా కలిగే దుష్ప్రభావాల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. 

✾ అధికమాసంలోని అమావాస్య శని చెబు ప్రభావంతో బాధపడేవారు తప్పకుండా పేద వారికి ఆహార పదార్థాలను దానం చేయాల్సి ఉంటుంది. 

✾ ఈ రోజు శివుడికి జలాభిషేకం చేయడం వల్ల శివుడి అనుగ్రహం లభిస్తుంది. 

✾ శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఓం నమః శివాయ మంత్రాన్ని చదువుతూ నీటితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. 

✾ అధికమాసంలోని అమావాస్య రోజు ఉపవాసం పాటించి శివలింగానికి పాలతో అభిషేకం చేయడం వల్ల మంచి జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి. 

Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై..! 

శివలింగాన్ని ఇలా పూజించండి:

✾ శని దేవుడి చెడు ప్రభావంతో బాధపడేవారు తప్పకుండా  ఈ రోజు శివలింగానికి పాలాభిషేకం చేయాల్సి ఉంటుంది. 

✾ ఆ తర్వాత పంచదారతో శివలింగాన్ని శుభ్రం చేయాలి.

✾ ఇలా చేసిన తర్వాత పాలతో శుభ్రం చేసి.. కుంకుమతో అలంకరించాలి.

✾ ఓం నమః శివాయ అనే మంత్రాన్ని చదుపుతూ స్వామికి పండ్లను సమర్పించాల్సి ఉంటుంది.

✾ ఆ తర్వాత చక్కెరతో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి.

Also Read: Wanindu Hasaranga: స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా సంచలన నిర్ణయం.. టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌ బై..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *