అకౌంట్లో మనీ లేకున్నా ATM నుంచి రూ.90 వేలు.. ఎగబడిన జనం.. ఎక్కడంటే?

ATM: ఏటీఎం కేంద్రంలోకి వెళ్లి మనీ డ్రా చేసినప్పుడు కొన్ని సార్లు టెక్నికల్ ఎర్రర్ వల్లా డబ్బులు కట్ అయినా నగదు బయటకు రాని సందర్భాలు చూసే ఉంటారు. కానీ, అకౌంట్లో డబ్బులు లేకపోయినా మీరు అడగకుండానే పెద్ద మొత్తంలో డబ్బులు ఏటీఎం నుంచి రావడం చూశారా? అలా వస్తే బాగుండు అని అనుకుంటున్నారా? అయితే, ఇలాంటి సంఘటనే ఓ ప్రాంతంలో బ్యాంక్ కస్టమర్లకు ఎదురైంది. ఓ బ్యాంకు ఏటీఎంలలో నగదు తీసేందుకు ప్రయత్నించిన వారికి వారి ఖాతాలో బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పటికీ ఏకంగా రూ. 90 వేలు వచ్చాయి. ఈ విషయం ఆనోట ఈనోట బయటకు రావడంతో ఒక్కసారిగా ఏటీఎం కేంద్రాలకు పరుగులు తీశారు. ఇదే అదునుగా భావించి చాలా మంది డబ్బులు డ్రా చేసుకోవడమే కాదు.. ఇతరులకు మనీ ట్రాన్స్‌ఫర్ సైతం చేశారు. ఫ్రీగా వచ్చినవి ఎందుకు వదులు కోవాలని ఇలా చేసినట్లు అక్కడి స్థానికులు సైతం చెప్పారు.

ఈ సంఘటన ఐర్లాండ్‌లో జరిగింది. గత మంగళవారం రాత్రి బ్యాంక్ ఆఫ్ ఐర్లాడ్ కస్టమర్లు ఏటీఎం కేంద్రాలకు పోటెత్తారు. అకౌంట్లో డబ్బులు లేకపోయినా మనీ డ్రా చేసుకునేందుకు ఏటీఎంలు అనుమతిస్తుండడమే ఇందుకు కారణం. డబ్ల్యూఎల్ఆర్ నివేదిక ప్రకారం బ్యాంక్ సిస్టమ్ లో ఏర్పడిన టెక్నికల్ ఎర్రర్ కారణంగా కస్టమర్లు 1000 యూరోలు (రూ.90,000) డ్రా చేసుకోవడం, ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అనుతించింది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎం కేంద్రాల వద్ద జనాలు గుమిగూడారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకూంటూ మనీ డ్రా చేసుకున్నారు. ఏటీఎం కేంద్రాల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు, కార్లు, బైకులు పార్క్ చేసి ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఏటీఎం కేంద్రాల వద్ద పోలీసులు ఉన్నప్పటికీ ఎలాంటి అడ్డు చెప్పలేదు. దీంతో కస్టమర్లకు పండగ వచ్చినట్లయింది. ఓ కస్టమర్ తాను 1000 యూరోలు డ్రా చేసుకున్నాని డబ్ల్యూఎల్ఆర్ మీడియాతో చెప్పగా మరొకరు 500 యూరోలు తీసుకున్నట్లు చెప్పారు. అయితే, ఫ్రీగా డబ్బులు వచ్చాయని సంతోషపడేలోపే బ్యాంకు కీలక ప్రకటన చేసింది. ఇంతకీ ఏం చెప్పిందంటే..

అకౌంట్లోంచి కట్ చేస్తాం: బ్యాంక్..

ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ఫ్రీ క్యాష్ తీసుకున్న ప్రతి ఒక్కరు తిరిగి చెల్లించాలని స్పష్టం చేసింది బ్యాంక్ ఆఫ్ ఐర్లాండ్. ఈ మేరకు ఎవరైతే అకౌంట్లో బ్యాలెన్స్ లేకున్నా ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకున్నారో వారు తిరిగి ఇచ్చేయాలని కస్టమర్లందరికీ సందేశాలు పంపించింది. ఎవరైతే తమ లిమిట్ కు మించి మనీ డ్రా చేశారో వారి అకౌంట్ నుంచి కట్ చేసుకుంటామని తెలిపింది. ప్రస్తుత సమయంలో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కుదరదని, అలా చెక్ చేసుకోకుండా మనీ ఎక్కువ డ్రా చేయడం వల్ల ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించింది.

Read Latest

Business News and Telugu News

102602683

102706786

102555940

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *