ఆగష్టు 16 రాశిఫలాలు, అధికమాసం ఆఖరిరోజు ఈ రాశులవారికి శుభసమయం

Horoscope Today 2023 August 16th

మేష రాశి

ఈ రోజు ఈ రాశివారికి మంచిరోజు. ఆరోగ్యం బావుంటుంది. వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు.  కొత్త ప్రణాళికలు అమలుచేసేందుకు ఈ రోజు మంచిరోజు. ఉద్యోగులకు శుభసమయం. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేయాలి అనుకున్నవారు ప్రయత్నాలు ప్రారంభించండి. 

వృషభ రాశి

ఈ రాశివారు అనవసర చర్చలకు దూరంగా ఉండడమే మంచిది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు ఈ రోజు మీకు మంచి రోజు. ఉద్యోగులు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. పరిష్కరించేదిశగా అడుగేయండి.

మిథున రాశి

ఈ రాశివారు వాహన వినియోగంలో జాగ్రత్త వహించాలి. ఓ నిర్దిష్ఠమైన పని పూర్తిచేయలేకపోవడం వల్ల మీరు కలత చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. నూతన పెట్టుబడులు పెట్టేవారు అనుభవజ్ఞుల సవహాలు స్వీకరించడం మంచిది.

Also Read: మీ దంతాలు ఊడినట్టు కలొచ్చిందా – అది దేనికి సంకేతమో తెలుసా!

కర్కాటక రాశి

ఈ రాశివారు నూతన వ్యాపారం మొదలెట్టేందుకు ఇది కలిసొచ్చే సమయం. పెద్ద భాగస్వామ్య ఒప్పందం పొందే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ గౌరవం పెరుగుతుంది. 

సింహ రాశి

ఈ రాశివారు ఈ రోజు శుభవార్తలు వింటారు. అనారోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. మీకు ఎవరితోనైనా విభేదాలుంటే అవి తొలగిపోతాయి . నూతన ఒప్పందాలు మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. నూతన వాహనం కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు.

కన్యా రాశి

ఈ రోజు మీకు హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. న్యాయపరమైన వ్యవహారాల్లో మీరు నష్టపోతారు. వ్యాపారంలో పెద్దగా రిస్క్ తీసుకోవద్దు.  మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. అనవసర చర్చలకు దూరంగా ఉండాలి.

 

తులా రాశి

ఈ రాశివారు ఈరోజు విచారకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వ్యాపారులు నష్టపోతారు. భాగస్వామ్య వ్యాపారంలో ఉన్నవారు నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో సమస్యలు పరిష్కారమవుతాయి. వైవాహిక జీవితం బావుంటుంది.

వృశ్చిక రాశి

ఈ రాశివారు ఆలోచనాత్మకంగా చేసేపనులు పూర్తవుతాయి. రోజంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఉద్యోగులకు మంచి జరిగే సమయం. కుటుంబంలో శుభ కార్యం జరిపేందుకు ప్లాన్ చేసుకుంటారు. ప్రత్యేక వ్యక్తులను కలిసే అవకాశం ఉంటుంది. 

Also Read: అంపశయ్యపై ఉన్న భీష్ముడిని ద్రౌపది అడిగిన ఒకే ఒక ప్రశ్న!

ధనస్సు రాశి

ఈ రాశివారు నూతన వాహనం కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు.కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. స్నేహితులు, బంధువుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు కలిసొస్తాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది

మకర రాశి

ఈ రాశివారు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతాయి. కుటుంబంలో అనూహ్యకరమైన ఓ సంఘటన జరిగే అవకాశం ఉంది. ఎవ్వరికీ పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వొద్దు, వ్యాపారంలో నష్టం ఎదుర్కొంటారు. కుటుంబంలో విభేదాలు ఉండొచ్చు. 

కుంభ రాశి

ఈ రాశివారికి ఇల్లు, కుటుంబం, వ్యాపారం గురించి ఏదో ఆందోళన వెంటాడుతుంది. ప్రత్యర్థులు ఉత్సాహంగా ఉంటారు మీరు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారంలో నష్టాలుంటాయి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. వాహనాల వినియోగంలో జాగ్రత్తగా ఉండాలి. 

మీన రాశి

ఈ రాశి వ్యాపారులకు పెద్ద కాంట్రాక్ట్ కుదురుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణకు ప్లాన్ చేస్తారు. ఉన్నతాధికారుల అంచనాలు అందుకోవడంలో ఉద్యోగులు సక్సెస్ అవుతారు. కుటుంబంతో మంచి సమయం స్పెండ్ చేస్తారు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *