ఆరోగ్యశ్రీ ​చైర్మన్​గా సుధాకర్​రావు

ఆరోగ్యశ్రీ ​చైర్మన్​గా సుధాకర్​రావు హైదరాబాద్, వెలుగు:  ఆరోగ్య శ్రీ ట్రస్ట్​ చైర్మన్ గా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన  బీఆర్ఎస్ నేత, డాక్టర్​ నెమురుగొమ్ముల సుధాకర్​రావును  సీఎం కేసీఆర్ నియమించారు.  ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి రెండేండ్లపాటు పదవిలో  కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మాజీ మంత్రి యతిరాజారావు కుమారుడైన డాక్టర్​సుధాకర్​రావు1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలో  పాల్గొన్నారు. 1999లో  చెన్నూరు (ప్రస్తుత పాలకుర్తి) నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

2010లో  బీఆర్ఎస్​లో  చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్​అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో పాలకుర్తి టికెట్​దయాకర్​రావుకు ఇచ్చినప్పుడే సుధాకర్​రావుకు కీలక పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనను ఆరోగ్య శ్రీ ట్రస్ట్​చైర్మన్​గా నియమించారు.

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *