ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో వైయస్ షర్మిల.. చరిత్రలో తొలి మహిళగా ఘనత

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. రికార్డు బద్దలుకొట్టారు. ప్రజా ప్రస్థానం యాత్ర పేరుతో తెలంగాణలో 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసినందుకుగాను వైయస్ షర్మిల‌ ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకున్నారు. 3800 కిలో మీటర్లు పాదయాత్ర చేసిన తొలి మహిళగా వైయస్ షర్మిల రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వైయస్ షర్మిలను కలిసి అభినందించి అవార్డును ప్రధానం చేశారు. అయితే.. ఈ సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా ఎన్ని అవాంతరాలొచ్చినా.. తన పాదయాత్రను కొనసాగించారు వైఎస్ షర్మిల. మధ్య మధ్యలో పోలీసులు ఆమె పాదయాత్రను అనుమతించకపోయినా.. న్యాయస్థానానికి వెళ్లి మరీ.. పర్మిషన్ తెచ్చుకుని యాత్రను కొనసాగించారు.

అయితే.. గతంలో కూడా తన సోదరుడు, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ కోసం షర్మిల పాదయాత్ర చేశారు. కానీ ఇంత సుదీర్ఘ పాదయాత్ర కాదు. అయితే.. ఇప్పుడు తెలంగాణాలో ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. జనాల్లోకి వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. ప్రభుత్వ పెద్దలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ.. కొనసాగించారు. ఈ క్రమంలో తన పాదయాత్రకు చాలా అడ్డంకులు ఎదుర్కున్నారు. అందులో ప్రత్యేకంగా వరంగల్‌లో కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటుచేసుకోగా.. కోర్టుకి వెళ్లి మరి అనుమతులు తెచ్చుకున్నారు షర్మిల.

కాగా.. ఇప్పుడు ఇన్ని అడ్డుకులు దాటుకుని 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల కృషికి చివరకి గుర్తింపు లభించింది. అయితే.. తన కృషిని గుర్తించినందుకు గానూ.. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు ధన్యవాదాలు చెప్పారు. అయితే షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఆమె పాదయాత్ర వల్లే కాంగ్రెస్ నాయకత్వం తనను గుర్తించిందని షర్మిల అనుచరులు చెప్తున్నారు.

102725069

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *