ఎలా బతకాలి: బెడ్ రూంలో టాయిలెట్ పెట్టారా.. లేక టాయిలెట్‌లో బెడ్ రూం ఉందా అదనపు అద్దె కోసం ఓనర్లు చేస్తున్న ప్రయోగాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఒక రూమ్‌ను రెండుగా కట్టేసి కిరాయికి ఇస్తున్న ఇంటి యజమానులు.. ఇప్పుడు మరో వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు.
ఇప్పటిదాకా టాయిలెట్ అనగానే ఏ బెడ్ రూం పక్కకో.. లేదంటే ఇంట్లో ఏదో ఒక మూలన ఉండేది. కానీ ఇప్పుడు బెడ్ రూంలోనే కట్టేస్తున్నారు. అలా అని అటాచ్డ్ బెడ్ రూం ఏమో అనుకోకండి. ఓపెన్ వాష్‌రూమ్. ప్రజల అత్యవసర సమస్యలు తీర్చడానికి విదేశాల్లో ఓపెన్ టాయిలెట్లు ఎలా కడుతున్నారో.. అలా కట్టేస్తున్నారు. అందులోనూ ఓ విభిన్న ప్రయోగం ఉంది.
ఢిల్లీలోని గ్రేటర్ కైలాష్ ప్రాంతంలో ఒక చిన్న గదిలో స్నానం చేయడానికి వీలుగా గాజుతో ఒక చిన్న నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. మరి రెండుకు వెళ్లాల్సివస్తే.. దానికి ఒక మార్గం చూపించాలి కదా! అందుకు దాని పక్కనే ఉన్న గోడకు టాయిలెట్ సీటు ఏర్పాటుచేశారు. ఒక యూజర్ రెడ్డిట్‌లో అప్‌లోడ్ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ప్రస్తుతం ఈ గదిలో నివాసం ఉంటున్న వ్యక్తికి తలుచుకొని నెటిజెన్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ గదికి ఎంత రెంట్ పే చేయొచ్చన్నదానిపై నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది.
©️ VIL Media Pvt Ltd.