జై చిరంజీవ సినిమాలో పాప చనిపోయే సీన్.. రియల్ గా జరిగింది.. ఎక్కడంటే..!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) లో సంచలనంగా మారిన చిన్నారి మృతి కేసు ఇప్పుడు పోలీసులకు సవాల్ విసురుతోంది. కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరు వద్ద జరిగిన ఈ దుర్ఘటన అయితే ఇప్పుడు స్థానికంగా పెద్ద చర్చ రేకెత్తిస్తోంది. లోవకొత్తూరు గ్రామంలో ఓ చిన్నారి ఆడుకుంటుండగా ఒక్కసారిగా బుల్లెట్ తగలడంతో కుప్పకూలిపోయి మృతి చెందటంతోఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తుని రూరల్ లోవ కొత్తూరు గ్రామంలో పందులను వేటాడేందుకు ఇటీవల నాటు తుపాకులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పందుల్ని వేటాడే క్రమంలో బుల్లెట్ చిన్నారికి తగిలిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఓ వ్యక్తి గ్రామంలో పందుల్ని వేటాడుతుండగా నాటు తుపాకీ పేల్చాడు. ఇది మిస్ ఫైర్ అక్కడే ఆడుకుంటున్న చిన్నారికి తగిలిందని చెబుతున్నారు.

అయితే ఆ వ్యక్తి అంత నిర్లక్ష్యంగా నాటు తుపాకీ ఎలా ఉపయోగించాడు.. అనేది ఇప్పుడు ప్రశ్న . లోవ కొత్తూరు కి చెందిన ధన్య శ్రీ అనే బాలిక మృతి చెందడం ఇప్పుడు వారి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని ముంచేతుంది ఆగస్టు 15 అందరూ సరదాగా పండగ వాతావరణాన్ని గడుపుకుంటూ ఉండగా ఈ విషాద వార్త మాత్రం అక్కడ స్థానికుల్ని కలచివేస్తోంది.

అసలు నాటు తుపాకీ ఎందుకు ఉపయోగించారు. ఇవి ఎక్కడినుండి వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో అయితే నాటు తుపాకీలు బంద్ ఉంది. గతంలో పోలీసులు రైడ్చేసి ఎక్కడికి అక్కడ నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ చాలాచోట్ల ఇంకా నాటు తుపాకీలు ఉపయోగిస్తూనే ఉన్నారు. వీటితో కొంతమందిని బెదిరించడం కూడా ఇటీవల కాలంలో చోటుచేసుకుంది.

ఇలాంటి నేపథ్యంలో ఓ చిన్నారిని ఈ నాటు తుపాకీ బలి తీసుకోవడం ఇప్పుడు అధికారులను సైతం ఆందోళన కలిగిస్తుంది. స్థానిక తుని రూరల్ పోలీసులు సంఘటన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. అక్కడే ఉన్నటువంటి ఈ నాటుతుపాకీ పేల్చిన వ్యక్తిని అదుపులోకైతే తీసుకున్న విచారిస్తున్నారు. అంతా ప్రమాదకర తుపాకులను ఇంకా ప్రజల మధ్య ఎలా ఉంచుతున్నారన్నది ఇప్పుడు అక్కడ స్థానికులను నుండి వస్తున్న ప్రశ్న. దీనిపై పోలీసు అధికారులు మాత్రం ఏం చెబుతారని వేచి చూద్దాం. ఏదేమైనా ఓ చిన్నారి నాలుగేళ్లకే ఇలాంటి నాటు తుపాకీకి బలి కావడం తీవ్ర విషాదం అయితే నింపిందనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *