టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్‌కు టీమిండియా ముంబై: గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌తో టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు మూడు టీ20ల సిరీస్‌లో అతనే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ నెల 18 నుంచి జరిగే సిరీస్ కోసం బుమ్రా నేతృత్వంలోని ఇండియా టీమ్ మంగళవారం ఐర్లాండ్ బయల్దేరింది.
స్పెషల్ ఫ్లైట్‌లో క్రికెటర్ల ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో రుతురాజ్, ప్రసిధ్ కృష్ణ, రింకూ సింగ్, శివం దూబే కూడా ఉన్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో పాల్గొన్న తిలక్ వర్మ, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, అర్ష్ దీప్, రవి బిష్ణోయ్, ముకేశ్ కుమార్ తదితరులు అక్కడి నుంచి నేరుగా ఐర్లాండ్ వచ్చి టీమ్‌లో చేరనున్నారు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లు ఈ నెల 18, 20, 23వ తేదీల్లో డబ్లిన్‌లో జరుగుతాయి.
©️ VIL Media Pvt Ltd.