దర్శకుడిని మార్చేశారట.. అబ్బా.. సాయి రామ్ అంటున్న మెగా ఫ్యాన్స్

దర్శకుడిని మార్చేశారట.. అబ్బా.. సాయి రామ్ అంటున్న మెగా ఫ్యాన్స్ ఒక్క రీమేక్.. ఒకే ఒక్క రీమేక్.. మెగాస్టార్(Megastar) ను సైతం ట్రోల్ అయ్యేలా చేసింది. అంతేకాదు ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అదే రీసెంట్ గా వచ్చిన భోళా శంకర్(Bhola shnakar). నిజానికి ఈ సినిమా అనౌన్స్ చేసినప్పుడే ఈ రిజల్ట్ ను కూడా ఊహించారు ఆడియన్స్. అందులోనూ మెహర్ రమేష్(Meher ramesh) దర్శకుడు. దీంతో సినిమాపై నెగిటీవ్ ఫీలింగ్  పీక్స్ కు వెళ్ళింది. ఇంకేముంది అందరు అనుకున్నట్టుగానే సినిమా ఫాల్ప్ గా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు, కామన్ ఆడియన్స్ కూడా చిరంజీవి(Chiranjeei) ఇకమీద రీమేక్స్ ఆపేయడం బెటర్ అనే కామెంట్స్ చేస్తున్నారు. 

అయితే ఈ సినిమా రిజల్ట్ తరువాత కూడా చిరు మరో రీమేక్ కు సిద్ధమయ్యారు అనే కామెంట్స్ వినిపించాయి. దీంతో మెగా ఫ్యాన్స్ కాస్త కంగారు పడ్డారు. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రీమేక్ ను చిరంజీవి క్యాన్సిల్ చేశారట. ఆ స్థానంలో బింబిసార(Bimbisara) దర్శకుడు వశిష్ట(Vasishta) చెప్పిన కథను ఒకే చేశారట. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రానుందని సమాచారం. ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందించనున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానుందని టాక్. ఈ సినిమాలో చిరంజీవి యుద్ధ వీరుడిగా కనిపించనున్నారట. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందట. త్వరలోనే ఈ భారీ ప్రాజెక్టు పై అధికారిక ప్రకటన రానుంది. ఈ న్యూస్ తెలుసుకున్న మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మంచి డెసిషన్ తీసుకున్నావ్ అన్న.. అబ్బా సాయి రామ్ అని కామెంట్స్ చేస్తున్నారు.  

©️ VIL Media Pvt Ltd.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *