దుర్మార్గుడా… తినే దాంట్లో ఏం పోస్తున్నావురా..

దుర్మార్గుడా… తినే దాంట్లో ఏం పోస్తున్నావురా.. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక ఫంక్షన్ జరుగుతుంది.  అప్పుడు పిండి వంటలతో కూడిన భోజనాలు పెడుతుంటారు.  వాటిని శుచిగా శుభ్రంగా తయారు చేయిస్తారు.  సరే ఇప్పుడంటే క్యాటరింగ్ లాంటి పద్దతులు వచ్చాయనుకోండి.  మరి ఆహార పదార్ధాలను తయారు చేసి వాటిలో ఏమీ పడకుండా ఉండేందుకు మూతలు ఉంచి సరైన జాగ్రత్తలు కూడా పాటిస్తారు. కొన్ని ఇళ్లల్లో వెరైటీ పదార్దాలు కూడా తయారు చేస్తారు.  అయితే ఇప్పుడు ఓ ఫంక్షన్ లో తయారు చేసిన ( గులాబ్ జాం) స్వీట్ ఉన్న పాత్ర లో ఓ వ్యక్తి మూత్రం పోస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఇలాంటి జుగుప్సాకరమైన ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది. 

ఏడు సెకన్లు నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్ లో ఎర్రటి టీ షర్ట్ ధరించిన ఓ వ్యక్తి గులాబ్ జాం ఉన్న పాత్ర ఎదుట నిలబడి ఉన్నాడు. ఆ వీడియోలో ఆ వ్యక్తి మూత్రం పోసినవిధంగా ఉంది.  ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారు క్యాప్షన్ లో అతని మతాన్ని ప్రస్తావించారు.  ఇలాంటి వారిని సమాజం నుంచి బహిష్కరించాలని రాశారు.  మరికొంతమంది ఈ బాస్టర్డ్ గులాబ్ జాం ఉన్న పాత్రలో మూత్రం పోశాడని కామెంట్  చేశారు. మరి కొంతమంది గులాబ్ జాం పాత్రలో ద్రవం పోశాడన్నారు.  అయితే ఈ వీడియో ఎక్కడినుంచి పోస్ట్ అయిందో స్పష్టంగా తెలియరాలేదు.  కాని  food 2 world 1 అనే ఇన్ స్ట్రాగ్రాం నుంచి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు. , 

ఈ వీడియో  షేర్ చేసిన వెంటనే వైరల్ గా మారింది.  స్థానిక దుకాణాల్లో ఏమీ తినకూడదని ప్రజలు చెప్పారు. ఇప్పటి వరకు లక్షలమంది చూశారు.   చాలా మంది ఈ చర్యను చెడుగా అభివర్ణించారు. ఆహార పదార్థాలతో ఇలాంటి నీచమైన పనులు చేస్తూ రోగాలు వ్యాప్తి చేయడమే వీరి లక్ష్యమని పలువురు కామెంట్ చేశారు.  . ఈ వీడియోపై పలువురు మతపరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే వీడియో ఏ ప్రదేశం నుండి వచ్చిందో నిర్ధారించబడలేదు.  ఏది ఏమైనా తినే పదార్దాలు శుచిగా.. శుభ్రంగా ఉండాలి.  ఆహారం వల్లే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.  ఈ మధ్య కాలంలో మురికి నీటితో తయారు చేసిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

  ©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *