బిగ్ బాస్‌ 7లో గల్లీ బాయ్స్ రియాజ్.. మరుగుజ్జు కోటాలో ఆ ఇద్దరి మధ్య పోటీ.. హిందీలో సూపర్ హిట్

మళ్లీ బిగ్ బాస్ హంగామా మొదలైపోయింది. మరికొన్ని రోజుల్లో సీజన్ 7 ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ పేర్లు ప్రచారం ఉన్నాయి. అయితే హిందీ బిగ్ బాస్ సీజన్ 16లో అబ్దు రోజిక్ (Abdu Rozik) అనే మరుగుజ్జు కంటెస్టెంట్‌ హైలైట్ అయ్యాడు. కేవలం మూడు అడుగులు ఎత్తు ఉండే అబ్దు రోజిక్ ఆ సీజన్‌లో అదరగొట్టేశాడు. కామెడీ టైమింగ్‌తో పాటు.. తన గాత్ర మాధుర్యంతోనూ ఆకట్టుకున్నాడు అబ్దు రోజిక్. ఇతను పాపులర్ సింగర్ కావడంతో.. బిగ్ బాస్‌లో అవకాశం వరించింది.

అయితే ఇప్పుడు ఇదే తరహాలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కూడా మరుగుజ్జు కంటెస్టెంట్‌ని తీసుకురాబోతున్నారట. ఈ కోటాలో మొన్నటి వరకూ జబర్దస్త్ కమెడియన్ పొట్టి నరేష్ (potti naresh) బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్‌గా వస్తారనే ప్రచారం నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. నరేష్ ప్లేస్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి గల్లీ బాయ్స్ రియాజ్ (Gully Boy Riyaz) అడుగుపెట్టబోతున్నాడట.

జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన రియాజ్.. బొమ్మ అదిరింది, అదిరింది వంటి షోలతో పాటు.. అనేక టీవీ కార్యక్రమాల్లో కనిపించాడు. రీసెంట్‌గా ‘దసరా’ సినిమాలోనూ ఇంపార్టెంట్ రోల్ చేశాడు. అంతేకాదు.. మనోడికి పాలిటిక్స్‌లో కూడా అడుగుపెట్టాడు. ఆ మధ్య జరిగిన నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన నుంచి నెల్లూరు 30 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీలోకి దిగి దారుణంగా ఓడిపోయాడు. కేవలం అతనికి 12 ఓట్లు మాత్రమే పడ్డాయి.

దీంతో కనీసం వాళ్ల ఇంట్లో వాళ్లనా రియాజ్‌కి ఓటు వేసి ఉంటారంటావా? అంటూ అప్పట్లో ట్రోలింగ్ నడిచింది. ఆ ఎన్నికల్లో అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ కొత్త చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు కార్పొరేషన్‌లోని అన్ని స్థానాల్లో గెలుపొంది క్లీన్‌స్వీప్‌ చేసి పారేసింది. 54 డివిజన్లలకు గాను అన్నీ స్థానాల్లో అఖండ విజయం సాధించింది. ఫ్యాన్ గాలిని తట్టుకోలేక రియాజ్ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అయితే ఇప్పుడు రియాజ్.. బిగ్ బాస్ వెళ్తున్నాడనే ప్రచారం ఊపందుకోవడంతో.. జనసేన పార్టీ మద్దతుతో పాటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఓట్లు రియాజ్‌కి పడే అవకాశం లేకపోలేదు. అయితే చివరి క్షణం వరకూ రియాజ్ ఉంటాడా లేదా అనేది సస్పెన్సే. నరేష్, రియాజ్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఉండటం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించి డజన్ల కొద్దీ కంటెస్టెంట్స్ పేర్లు వినిపిస్తున్నాయ్. అయితే హౌస్‌లోకి ఎవరు వెళ్తారనేది మాత్రం చివరి వరకూ సస్పెన్సే. ఎందుకంటే గత మూడు సీజన్ల చూసుకుంటే.. కరోనా ఎఫెక్ట్‌తో ఎవర్నైతే కంటెస్టెంట్స్‌గా ఎంపిక చేశారో వాళ్లని.. క్వారంటైన్స్‌కి తరలించే వాళ్లు. కాబట్టి.. హౌస్‌లోకి వెళ్లబోతుందన్నదెవరనే విషయం రెండు, మూడు వారాల ముందే బయటకు వచ్చేది.

కానీ ఈసారి గత సీజన్ల మాదిరే.. క్వారంటైన్ ఇష్యూ లేకపోవడంతో.. ఒక్కరోజు ముందు కూడా కంటెస్టెంట్స్‌కి కాల్ వెళ్లి చివరి క్షణంలో హౌస్‌లోకి అడుగుపెట్టొచ్చు. పైగా ఈసారి ఉల్టా పల్టా అంటుున్నారు కాబట్టి.. సోషల్ మీడియాలో వినిపించే పేర్లన్నింటినీ పక్కనెట్టి.. ఎవరూ ఊహించని అసలు ప్రచారంలోని కంటెస్టెంట్స్‌ని హౌస్‌లోకి పంపించిన పంపించొచ్చు.

హౌస్‌లోకి ఎవరు వెళ్లినా.. బయటకు ఎవరు వచ్చినా కూడా.. సీజన్ 6 పరమ వరస్ట్ సీజన్ కావడంతో.. సీజన్ 7పై ఆసక్తి లేకుండా పోయింది. అయితే ఇప్పుడు ఒకప్పటి బిగ్ బాస్‌ షోకి ఉన్న ఆదరణను తిరిగి రప్పించాలనే ఉద్దేశంతో.. సమూలంగా మార్పులు చేశారు. ఏది ఏమైనా సీజన్ 7 మాత్రం రొటీన్‌‌కి భిన్నంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. ప్రోమోలతో బిగ్ బాస్‌ సీజన్ 7‌పై భారీగా అంచనాలు పెంచేస్తుండటంతో.. ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయినా.. టోటల్ సీజన్ బిస్కెట్ అయ్యే ప్రమాదం లేకపోలేదు.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *