Gold Prices Today | బంగారం కొనే వారికి లక్కీ ఛాన్స్. ఎందుకని అనుకుంటున్నారా? పసిడి రేటు పడిపోయింది. బంగారం ధరలు దిగి వచ్చాయి. గోల్డ్ రేటు పతనమైంది. బంగారం బాటలో కాకుండా వెండి (Silver) రేటు మాత్రం రివర్స్ గేర్‌లో నడిచింది. అయితే గత పది రోజుల కాలంలో చూస్తే బంగారం (Gold), వెండి ధరలు భారీగా దిగి వచ్చాయి. కొనే వారికి ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
హైదరాబాద్‌లో పసిడి రేటు పడిపోయింది. విశాఖ పట్నం, విజయవాడలో కూడా దాదాపు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. బంగారం ధరలు బలహీనంగా ఉన్నాయి. గోల్డ్ కొనాలని భావించే వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. పసిడి రేటు ఆగస్ట్ 16న దిగి వచ్చింది. 24 క్యారెట్ల బంగారం ధర వెలవెలబోతోంది. ఈ పసిడి రేటు రూ. 110 మేర దిగి వచ్చింది. దీంతో బంగారం రేటు పది గ్రాములకు రూ. 59,400కు పడిపోయింది. అదేసమయంలో 22 క్యారెట్ల ఆర్నమెంటల్ గోల్డ్ రేటు విషయానికి వస్తే.. ఈ గోల్డ్ రేటు కూడా రూ. 100 పడిపోయింది. దీంతో పసిడి రేటు పది గ్రాములకు రూ. 54,450కు తగ్గింది.
రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. మీ డబ్బు రెట్టింపు చేస్తున్న ప్రభుత్వ బ్యాంక్!
కాగా బంగారం ధరలు నిన్న కూడా తగ్గాయి. ఆగస్ట్ 15న కూడా గోల్డ్ రేటు నేల చూపులు చూసింది. నిన్న కూడా బంగారం ధరలు దాదాపు ఇదే మాదిరిగా దిగి వచ్చాయి. అంటే రెండు రోజుల్లోనే బంగారం ధరలు రూ. 220 మేర తగ్గాయని చెప్పుకోవచ్చు. కాగా పది రోజుల కాలంలో చూస్తే పసిడి రేటు ఏకంగా రూ. 750 వరకు దిగి వచ్చింది. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశం అని చెప్పుకోవచ్చు.
మధ్యతరగతి ప్రజలకు మోదీ అదిరిపోయే శుభవార్త.. కొత్త స్కీమ్!
బంగారం ధరలు తగ్గితే వెండి రేటు మాత్రం ఈ రోజు రివర్స్ గేర్‌లో వెళ్లింది. సిల్వర్ రేటు జిగేల్ మంటూ దూసుకుపోయింది. వెండి కొనే వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సిలర్వ్ రేటు ఈ రోజు రూ. 200 పైకి చేరింది. దీంతో వెండి ధర కేజీకి రూ. 76,200కు ఎగసింది. కాగా నిన్న వెండి ధర స్థిరంగానే కొనసాగింది. తెలుగు రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాల్లో కూడా బంగారం, వెండి ధరలు దాదాపు ఇలానే ఉన్నాయని చెప్పుకోవచ్చు.
కాగా పైన ఇచ్చిన బంగారం ధరలకు వస్తు సేవల పన్ (జీఎస్‌టీ) అదనంగా పడుతుంది. ఇంకా తయారీ చార్జీలు కూడా ఉంటాయి. అందువల్ల బంగారం కొనే వారు ఈ విషయాన్ని కూడా గుర్తించుకోవాలి. వీటిని కూడా కలుపుకుంటే బంగారం ధరలు ఇంకా పైకి చేరుతాయని చెప్పుకోవచ్చు.