మోదీ, బాబు-అముడాల బిడ్డలు

మనో వైజ్ఞానిక శాస్త్రం చాలా గొప్పది. మనుష్యుల పుట్టుక, కుటుంబం, పెరిగిన వాతావరణం,పెంచుకున్న ఆలోచనలు అభిప్రాయాలు – వీటన్నింటినీ క్రోడీకరించి, పెద్దవారయ్యాక వారి వ్యక్తిత్వం ఎలా రూపుదిద్దుకుంటుందోనని చాలా వివరంగా చెప్తుంది శాస్త్రం. శాస్త్రజ్ఞులు చాలా బీదరికంలో పెరిగినవారి గురించి చాలానే రాశారు.

మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అవ్వడం అటల్‌ బిహారీ వాజపేయికి ఇష్టం లేదు. గోద్రా ఘటన తర్వాత జరిగిన అల్లర్లు కూడా ఆయనను చాలా బాధపెట్టాయి. కానీ, అద్వానీ ప్రోద్బలంతో మూడు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు మోదీ. అన్నం పెట్టిన అద్వానీకి మోదీ సున్నం పెట్టలేదా? ఆఖరికి పార్లమెంటు భవనంలో తను రాజదండం గ్రహించే ఉత్సవానికైనా భారతీయ జనతా పార్టీలో ఒక వ్యవస్థాపకుడు, తనకు రాజ గురువైన అద్వానీని పిలువకపోవడం ద్రోహం కాదా?

బీద కుటుంబాల్లో పుట్టి, అన్నింటికి లేమిని అనుభవిస్తూ కౌమారదశ దాకా పెరిగిన మనుష్యులు రెండురకాలుగా తయారవుతారని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెప్తారు. వారిలో సగం మంది జీవితంలో స్థిరపడ్డాక తమ పిల్లలు తమలాగా కష్టపడకూడదని వారికి అన్ని సదుపాయాలు సమకూరుస్తూ తమలాగా కష్టపడుతున్నవారికి సహాయపడుతూ తృప్తిపడుతారు. ఇక రెండో వర్గం పేదరికంపై కసితో ఎదిగిన తర్వాత తాము ఇతరులకంటే చాలా ఉన్నతంగా బతకాలన్న ఆశతో పైకి వస్తారు. పేదరికంలో ఉన్న కష్టాలే కాక, ఇతర అవమానాలను ఎదుర్కొన్నవారికి నేర ప్రవృత్తి ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుందని వీరు చెప్పిన మాటలు అడాల్ఫ్‌ హిట్లర్‌ విషయంలో స్పష్టంగా తెలుస్తాయి.

వివాహం కాకుండానే పుట్టిన బిడ్డ హిట్లర్‌తో సహా తర్వాత తనను పెండ్లిచేసుకున్న భర్త దగ్గరికి వస్తుంది అతని తల్లి. అయితే, అప్పటికే సవతి తండ్రి మొదటి వివాహం ద్వారా పుట్టిన ఇద్దరి పిల్లల వల్ల చాలా అవమానాలు ఎదుర్కొంటారు అడాల్ఫ్‌. తనకు పదేండ్లున్నప్పుడు తల్లి మరణించటంతో జాలితో తనను పెంచుకున్న ఇంకో సవతి తండ్రి దగ్గర పెరిగి ప్రపంచంలోనే అతిక్రూర నియంతగా ప్రవర్తించి ఘోరంగా మరణించిన హిట్లర్‌ జీవితం ప్రపంచానికే ఒక మంచి పాఠం.

మన దేశంలో బీదరికంలోంచి పైకి వచ్చి కుబేరు లైనవారు చాలామందే ఉన్నారు. కొందరు నడమంత్రపు సిరిమంతులు స్టాక్‌ మార్కెట్‌తో ఎలా ఆడుకున్నారో తెలిసిందే. ముఖ్యంగా చెప్పుకోవలసిన కవలపిల్లల వంటివారు మోదీ, చంద్రబాబు. వీరిద్దరూ అతి పేదరికంలో పెరిగినవారే, కసితో పైకి వచ్చినవారే. లేమిలో పెరిగినవారికి ధన వ్యామోహం ఎంత ఉంటుందో తెలుసుకోవటానికి తగిన ఉదాహరణలు ఈ ఇద్దరు రాజకీయ నాయకులు. రెండెకరాల ఆసామి చంద్రబాబు ఒక్క టర్మ్‌ ముఖ్యమంత్రిగా చేసేటప్పటికే సింగపూర్‌లో, ఏడు నక్షత్రాల హోటళ్లు నిర్మించగలగడం, ప్రధానమంత్రి అవ్వగానే 10 లక్షల సూట్లు ధరించి, 2 టర్మ్‌లు కాకుండానే నరేంద్ర మోదీ నలభై సార్లు విదేశాలు తిరగటం వారిద్దరికీ బీదరికం మీద ఉన్న జుగుప్స, ధనవంతుల్లా బతకాలన్న కోరికకు అద్దంపడుతాయి. ఇక వీరి రాజకీయ ప్రస్థానం, తర్వాత ప్రవర్తనలో కూడా సమాంతరమైన పోలికలు ఉండటం చాలా ఆశ్చర్యకరం.

చంద్రబాబుకు ఇంకో పేరు, సామాన్య జనాలు అనుకునేది వెన్నుపోటు దారుడు. కానీ, ఆయనలాగే తన రాజకీయ గురువైన అద్వానీకి, అఖండమైన తెలివితేటలు, అనుభవం ఉన్న మురళీమనోహర్‌ జోషిలాంటి రాజకీయ సీనియర్లను మోదీ వెనక్కితోయటం వెన్నుపోటు కాదా? డబ్బు సంవత్సరాలకంటే వయస్సు పైబడ్డ వారు రాజకీయాల్లోంచి తప్పుకోవాలని, ఒక్క దెబ్బతో సీనియర్లందరినీ వెనక్కి తోసిన మోదీది వెన్నుపోటు అనలేమా?

నిజానికి మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రి అవ్వ డం కూడా విలువలు కల మానవతావాది అటల్‌ బిహారీ వాజపేయికి ఇష్టం లేదు. గోద్రా ఘటన తర్వాత జరిగిన అల్లర్లు కూడా ఆయనను చాలా బాధపెట్టాయి. కానీ, అద్వానీ ప్రోద్బలంతో మూడు టర్మ్‌లు ముఖ్యమంత్రిగా ఉండగలిగాడు మోదీ. అన్నం పెట్టిన అద్వానీకి మోదీ సున్నం పెట్టలేదా? ఆఖరికి పార్లమెంటు భవనంలో తను రాజదండం గ్రహించే ఉత్సవానికైనా భారతీయ జనతా పార్టీలో ఒక వ్యవస్థాపకుడు, తనకు రాజ గురువైన అద్వానీని పిలువకపోవడం ద్రోహం కాదా? చంద్రబాబు వలె బహుశా తర్వాత ఫొటోలకు దండలేయించి పుట్టినరోజులు చేస్తాడేమో. ఒక్కరు ముఖ్యమంత్రి అయి మామను, ఇంకొకరు ప్రధానమంత్రి అయి గురువుకు ద్రోహం చేసినవారే కదా?

ఇక పదవులు పొందాక అత్యాశ ఉన్నవాళ్లకు అడ్డేముంది? ఎలక్షన్ల ఫలితాలు వెలువడగానే, కావలసినంత మంది ఎమ్మెల్యేలను, ఎంపీలను కొని శాసనసభలో, లోక్‌సభలో బలం పెంచుకోవటానికి ధనరాశులు అత్యంత నిజాయితీగల అవినీతి తెలియని మోదీకి ఎక్కడినుంచి వస్తాయి? ప్రజలు అత్యధికంగా ఓటేసి ఎన్నుకున్న పార్టీలు కాకుండా తన పార్టీని అధికారంలో నిలపడం మోదీకి ఎలా సాధ్యం? ఇక నలభై ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో కేవలం 14 ఏండ్లు మాత్రం పదవిలో ఉన్న చంద్రబాబుకు ఈ 26 సంవత్సరాలు తన పార్టీని నడిపే ధనం ఎక్కడినుంచి వస్తోంది? పదవిలో ఉన్నప్పుడు ఎంత సొమ్ము పోగేస్తే మరి దశాబ్దాల పాటు పార్టీని ఉంచుకోగలడు? ఎవరికీ ఈ అనుమానం రాదా?

ఇక మిగతా విషయాలు- ముఖ్యమంత్రిగా చేసినవాడికి కులపిచ్చి అయితే, ప్రధానమంత్రిగా ఉన్నవాడికి భాషా దురభిమానం, మత మౌఢ్యం. ఇక ప్రస్తుతం 2014 నుంచి ప్రధాని మోదీ గుజరాతీ వ్యాపారస్థులకు వెన్నుదన్నుగా నిలబడ్డాడు. పాలసీల మార్పిడులు, బ్యాంకుల మీద రుణాల కోసం ఒత్తిళ్లు, తీసుకున్న రుణాల మాఫీలు, ప్రభుత్వరంగాల అమ్మకాలు, వాటిని గుజరాతీ వ్యాపారస్థులకు అమ్మడం కొందరు గుజరాతీ వ్యాపారస్థులు దేశం విడిచి పారిపోయి విదేశాలలో విలాసవంతమైన జీవితం గడుపుతుంటే దేశంలో ఉన్న మోదీ స్నేహితులు ప్రపంచ కుబేరులవుతున్నారు. మరి సామాన్య ప్రజలు మోదీ పాలనలో అతలాకుతలమవుతున్నారు.

చంద్రబాబుకు, మోదీకి కూడా బీదరికం నిర్మూలించడం అంటేబీదవారు లేకుండా చేయటం. మోదీకి ఇంకొక్క టర్మ్‌ ప్రధానమంత్రిగాఅవకాశం ఇస్తే బహుశా దేశ జనాభా సగం తగ్గిపోవచ్చు. ఎందుకంటే 2014లో 20 కోట్ల మందిబీదవారుంటే, 2023కి ఆ సంఖ్య నలభై కోట్లకు పెరిగింది. బతుకడానికి మరి మోదీ హఠావ్‌ కావాలో వద్దో నిర్ణయించుకోవలసింది ఈ సామాన్య ప్రజలే.

ఇక రాజకీయ వ్యక్తిత్వ విలువల గురించి చెప్పాలంటే ఇద్దరూ ఒక్కటే. జగన్మోహన్‌రెడ్డికి అపకారం చేయాలంటే తనను ఘోరంగా తిట్టిన చంద్రబాబుతో పొత్తుకు వెనుకాడడు మోదీ. ఇక ఈ నలభై ఏండ్ల అనుభవం గల ఆయన రాజకీయ రంగంలో అపరిచితుడు. ఇప్పుడే తిట్టినా వెంటనే పొగడగలడు. ఎవ్వడైనా తనను తిట్టినా తుడిచేసుకోగలడు. రాజకీయాల కోసం ఇద్దరు నేతలూ మానవత్వాన్ని మరిచిపోగలరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్లు అన్న నెపంతో జిల్లాకు వందలాది మంది యువతను ఎన్‌కౌంటర్లు చేయించాడు చంద్రబాబు. రైతులను కాల్పించటమే కాదు, కాల్‌మనీ రాకెట్లలో ఉన్నవారిని విడిపించటం, మహిళలను జుట్లు పట్టుకొని ఈడ్చినవారిని ఆదరించడం కూడా తెలిసిన నేత ఈయన. ఇక బేటీ పడావో, బేటీ బచావో అని నినదించే ప్రధానమంత్రికి ఆ బేటీల మర్యాద, మానప్రాణాలు లెక్కలేవు. గుజరాత్‌లో కేవలం ముస్లిం మహిళల మీద తిరస్కారం అనుకున్నారు. కానీ, కాదు. అంతర్జాతీయ మెడల్స్‌ పొందిన ఆడపిల్లల రోదన మోదీ ఏమిటో ప్రపంచానికి చాటిచెప్పింది. మతం లేదు, కులం లేదు, కనీసం వెనుకబడి ఉన్న మణిపూర్‌ ఆదివాసీలనీ లేదు. తన రాజకీయ విజయానికి ఎవరినైనా బలిపెట్టగల ధీరుడు నరేంద్ర మోదీ.

కర్మ, ఉసురు లాంటి సిద్ధాంతాలు నమ్మనివారు ఈ విషయం చూడండి. రాహుల్‌ గాంధీ ఒక్క మాట తనను అన్నాడని గబగబా కేసులు పెట్టి త్వరత్వరగా ఆయనను పార్లమెంటులోకి రాకుండా బహిష్కరణ చేయించిన మోదీకి అన్ని అధికారాలు ఉండి, ఎంత ఆశతో కట్టుకున్న పార్లమెంటు భవనంలోకి రాకుండా చేయగలిగిన శక్తి ఏమిటి? ఇక నారా నాయుడికి 2019 ఎన్నికల్లో 23 మందే పార్టీలో ఎన్నికయ్యేటట్టు చేసినవారెవరు? ఆలోచించండి. వీరికి మళ్లీ అధికారం ఇద్దామా? రాజకీయంగా బహిష్కరిద్దామా? ప్రజలు ఆలోచించాలి.

-కనకదుర్గ దంటు

89772 43484

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *