గుంటూరు జిల్లా (Guntur District) అంటే టక్కున గుర్తొచ్చేది మిర్చి. గుంటూరు మిర్చి (Guntur Mirchi) అంటే కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రమే కాదు దేశ విదేశాల్లో కూడా వీటికి చాలా డిమాండ్ ఎక్కువ. ఎంతగా అంటే ఈ గుంటూరు మిర్చి పై ఏకంగా కొన్ని సినిమాలే తీశారు అంటే వాటి డిమాండ్ ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పానక్కర్లేదు. గుంటూరు జిల్లాలో ఉన్న మిర్చి యార్డ్ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో పండించిన మిర్చిని రైతులుఅమ్ముకోవడానికి ఇక్కడికే తీసుకు వస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లా రికార్డులు తీరగారస్తుంది. అందులోనూ ప్రస్తుత ప్రభుత్వం చొరవతో నంద్యాల జిల్లాలో మిర్చి యార్డును ఏర్పాటు చేయడంతో ఇప్పుడు కర్నూలు, నంద్యాల జిల్లాలో మిర్చి కొనుగోళ్లు జోరందుకున్నాయి. అందుకు ఉదాహరణ
గత ఏడాది కర్నూలు జిల్లా (Kurnool District) లో మిర్చికి రికార్డు స్థాయి ధరలు లభించడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. విదేశాలకు ఎగుమతులు పెరుగుతుండటంతో ఈ సారి మిర్చి సాగు అధికం కానుంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మిర్చి సాధారణ సాగు 50,395 ఎకరాలు ఉండగా ఈ-క్రాప్ ప్రకారం గత ఏడాది జిల్లాలో 65,913 మంది రైతులు 1,28,108.7 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు.
ఇది చదవండి: ఏపీలో ఎండలకు కారణం ఇదే..! అలాంటివారికి చాలా డేంజర్
ఇది వరకు గుంటూరు , పల్నాడు, బాపట్ల జిల్లాల్లో గత ఏడాది 2,12,152 ఎకరాల్లో మిర్చి సాగయింది. అయితే ఒక్క కర్నూలు జిల్లాలోనే ఈ ఏడాది సుమారు 1.28 లక్షల ఎకరాల్లో సాగు కావడం విశేషం. ఒక ఎకరాకు సగటున 25 క్వింటాళ్ల ప్రకారం ఎండు మిర్చి దిగుబడులు వస్తుండగా ఇప్పుడు దాదాపు 32 లక్షల క్వింటాళ్లు వచ్చి నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో ఈ ఏడాది మిర్చి సాగు ఇప్పు డిప్పుడే ఊపందుకుంటోంది. ఈ సారి జిల్లాలో మిర్చి సాగు దాదాపు 1.50 లక్షల ఎకరాలకు చేరే అవకాశం ఉన్నట్లు ఉద్యాన శాఖ అంచనా వేసింది.అందులోని మిర్చి పంటకు మంచి డిమాండ్ ఉండంతో రైతులు సైతం మిర్చి సాగు చేయడానికే ఎక్కువగా మగ్గుచూపుతున్నారు.