రూ.14 వేల స్మార్ట్‌ఫోన్ రూ.7,699కే.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ ఫీచర్లు

Amazon Offers | మీరు బడ్జెట్ ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఎందుకంటే అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) భారీ డిస్కౌంట్‌తో స్మార్ట్‌ఫోన్స్ లభిస్తున్నాయి. మీరు తక్కువ ధరలోనే అదిరే ఫీచర్లతో కొత్త ఫోన్ (Phone) సొంతం చేసుకోవచ్చు. మీరు ఎంచుకునే ఫోన్ ఆధారంగా మీకు వచ్చే డిస్కౌంట్ ఆఫర్లు కూడా మారుతూ ఉంటాయి. మనం ఇప్పుడు తక్కువ ధరకే లభిస్తున్న ఒక ఫోన్ ఆఫర్ గురించి తెలుసుకుందాం.

అమెజాన్‌లో రెడ్‌మి 12సీ ఫోన్ అందుబాటు ధరకే లభిస్తోంది. ఈ ఫోన్ ధర రూ. 13,999గా ఉంది. అయితే మీరు ఇప్పుడు దీన్ని రూ. 8499కే కొనొచ్చు. అంటే మీకు 39 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. అలాగే బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. అమెజాన్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్ కొంటే 5 శాతం క్యాష్ బ్యాక్ సొంతం చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్‌పై ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. కూపన్ డిస్కౌంట్ వస్తోంది.

రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. మీ డబ్బు రెట్టింపు చేస్తున్న ప్రభుత్వ బ్యాంక్!

మీరు కూపన్ రూపంలో రూ. 800 తగ్గింపు పందొచ్చు. అంటే అప్పుడు మీకు ఈ ఫోన్ రూ. 7699కే వచ్చినట్లు అవుతుంది. అందుకే చౌక ధరలోనే మంచి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు. ఈ ఫోన్‌పై తక్కువ ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి. నెలకు ఈఎంఐ రూ. 416 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 534 కట్టాలి. 12 నెలల టెన్యూర్ అయితే నెలకు 771 పడుతుంది. 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ.1000 చెలించుకోవాలి.

మహిళలకు మోదీ అదిరే శుభవార్త.. కీలక ప్రకటన!

ఇంకా ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. ఆరు నెలల వరకు ఈ బెనిఫిట్ పొందొచ్చు. నెలకు రూ. 1417 చెల్లించాలి. మూడు నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 2833 పడుతుంది. బజాజ్ ఈఎంఐ కార్డు ద్వరా కూడా మీరు ఈ ఫోన్ కొనొచ్చు. మూడు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 2833 చెల్లించాలి. ఇక ఈ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్, 64 జీబీ మెమరీ, 4జీ, 50 ఎంపీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.71 ఇంచుల డిస్‌ప్లే వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *