రూ.20 వేల స్మార్ట్‌టీవీ రూ.7,800కే.. రూ.35 వేల టీవీ రూ.9,600!

Amazon Offers | మీరు కొత్తగా స్మార్ట్ టీవీ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా? అయితే మీకోసం భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. సగం కన్నా తక్కువ ధరకే స్మార్ట్ టీవీ సొంతం చేసుకోవచ్చు. ప్రముఖ ఈకామర్స్ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న అమెజాన్‌లో (Amazon) ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. కళ్లుచెదిరే డీల్స్ లభిస్తున్నాయి. రెండు స్మార్ట్ టీవీలపై (TV) భారీ ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.

ఐఫాల్కన్ కంపెనీకి చెందిన 32 ఇంచుల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ టీవీ ఎంఆర్‌పీ రూ. 19,990గా ఉంది. అయితే మీరు దీన్ని రూ. 8,999కే కొనొచ్చు. అంటే 55 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా ఈ స్మార్ట్ టీవీపై సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అదనంగా రూ. 1174 వరకు తగ్గింపు వస్తోంది. అంటే మీకు ఈ టీవీ రూ. 7824కే లభించినట్లు అవుతుంది.

మహిళలకు మోదీ అదిరే శుభవార్త.. కీలక ప్రకటన!

ఈ టీవీపై నెలవారీ ఈఎంఐ రూ. 432 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. 18 లల టెన్యూర్ అయితే నెలకు రూ. 566 పడుతుంది. ఏడాది టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 816 కట్టాలి. 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ.1068 చెల్లించాలి. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 1500 పడుతుంది. 3 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 3 వేలు చెల్లించాలి.

రూ.5 లక్షలకు రూ.10 లక్షలు.. మీ డబ్బు రెట్టింపు చేస్తున్న ప్రభుత్వ బ్యాంక్!

అలాగే పవర్ గార్డ్ 32 ఇంచుల ఫ్రేమ్‌లెస్ హెచ్‌డీ రెడీ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 34,990గా ఉంది. అయితే మీరు ఈ టీవీని రూ. 10,999కే కొనొచ్చు. అంటే ఏకంగా 69 శాతం డిస్కౌంట్ వస్తోంది. అలాగే ఈ టీవీపై క్రెడిట్ కార్డు ఆఫర్ కూడా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా రూ. 1324 డిస్కౌంట్ పొందొచ్చు. అంటే అప్పుడు మీకు ఈ స్మార్ట్ టీవీ రూ. 9674కే లభించినట్లు అవుతుంది. అలాగే ఈ టీవీపై ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంది. రూ. 2,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అప్పుడు మీకు ఇంకా తక్కువకే స్మార్ట్ టీవీ వచ్చినట్లు అవుతుంది. ఈ టీవీపై కూడా ఈఎంఐ తక్కువగానే ఉంది. నెలకు రూ. 528 నుంచి ఈఎంఐ పడుతుంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. టెన్యూర్ మారితే ఈఎంఐ కూడా మారుతుందని గుర్తించుకోవాలి.  మీకు నచ్చిన టెన్యూర్ ఎంచుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *