రోజుకు 111 ట్యాబ్లెట్లు.. యువకుడిలా కనిపించాలని ఏటా రూ.16 కోట్ల ఖర్చు!

మనుషులు ఏం చేసినా చేయకున్నా వయసు మాత్రం రోజు రోజుకూ పెరుగుతూనే ఉంటుంది. బాల్యం, యవ్వనం, మధ్యవయసు, వృద్ధాప్యం ఇలా మానవ జీవిత చక్రంలో వివిధ దశలు ఉంటాయి. అయితే చాలా మంది వయసు మీద పడుతున్నా తాము ఎప్పటికీ యవ్వనంగానే కనిపించాలని భావిస్తారు. వయసు మీద పడిన కొద్దీ శరీరంలో మార్పులు, చర్మం ముడతలు పడటం జరుగుతుంది. అయితే అది కనిపించకుండా కొంతమంది యోగా, ఎక్సర్‌సైజ్ వంటి ప్రకృతి సిద్ధమైన పద్దతులు పాటిస్తూ ఉంటారు. మరికొంతమంది మేకప్‌లు వేసుకుంటారు. అయితే మేకప్‌లు తాత్కాలికంగా ఉంటాయని భావించినవారు, బాగా డబ్బు ఉన్న వాళ్లు.. సర్జరీలు, రకరకాల చికిత్సలు తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి చికిత్సలు, ఆపరేషన్లు వికటించి చనిపోయిన వారి సంఖ్య భారీగానే ఉంది. అయినప్పటికీ యుక్తవయస్సుకు రావాలని చాలా మంది ప్రయత్నాలు మాత్రం ఆపకుండా చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి తాను యవ్వనంగా కనిపించాలని సంవత్సరానికి ఏకంగా రూ. 16 కోట్లు ఖర్చు చేస్తున్నాడు.

అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ.. యువకుడిలా కనిపించాలని తీవ్రంగా ఆరాటపడుతున్నాడు. 45 ఏళ్ల బ్రియాన్‌ జాన్సన్‌.. భారీగా ఆస్తులు, డబ్బు కలిగి ఉన్నాడు. 18 ఏళ్ల యువకుడిలా కనిపించేందుకు బ్రియాన్ జాన్సన్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ప్రత్యేకంగా డాక్టర్ల బృందంతో రకరకాల చికిత్సలు తీసుకుంటున్నాడు. 45 ఏళ్ల వయసులో ఉన్నట్లు కాకుండా యువకుడిగా కనిపించేందుకు ఏటా ఏకంగా రూ. 16 కోట్లు తన చికిత్సల కోసమే ఖర్చు పెడుతున్నాడు. అయితే తనకు తోడు మాత్రం దొరకడం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వృద్ధాప్యం రాకుండా రూ.కోట్లు ఖర్చుపెడుతున్న ఈ రిచ్ మ్యాన్ వ్యవహారం ఇప్పటికే అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే తాను వృద్ధాప్యం దరిచేరకుండా తన చికిత్సలో భాగంగా రోజుకు 111 మాత్రలు వేసుకుంటానని బ్రియాన్‌ జాన్సన్‌ వివరించాడు. ఇక రాత్రి 11 గంటలకు డిన్నర్ చేస్తానని చెప్పడం గమనార్హం.

అయితే ఇంత సంపద, అందం ఉన్నప్పటికీ తన వద్దకు ఏ మహిళ రావడం లేదని చెబుతున్నాడు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో తన అనుభావాలను బ్రియాన్‌ జాన్సన్ పంచుకున్నాడు. ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని.. భాగస్వామి దొరకడం చాలా కష్టమైందని అంగీకరించాడు. అయితే ఆయన పెట్టిన పది షరతులే కారణంగానే ఎవరూ తనతో డేటింగ్‌కు రావడం లేదని పేర్కొన్నాడు. తనతో ఎవరైనా డేటింగుకు అంగీకరిస్తే అన్నింటికన్నా ముందు తాను వారి ముందు ఓ జాబితా ఉంచుతానని చెప్పుకొచ్చాడు. అయితే ఆ లిస్ట్ చూసి తనతో డేటింగ్ చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని తెలిపారు. అయితే తనకు నిద్రపోయేటపుడు కాళ్లు, చేతులు ముడుచుకొని పడుకోవడం అలవాటని.. ఎవరితోనైనా డేటింగ్‌కు వెళ్లినపుడు అలా ఉండలేం కదా అని పేర్కొన్నారు.

102749140

102730396

Read More Latest International News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *