10 వేలకు రూ.2.40 లక్షల లాభం.. లక్షకు 15 లక్షల ప్రాఫిట్.. ఈ టాటా స్టాక్‌తో దశ తిరిగింది!

TATA Stock: స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అని చాలా మంది భావిస్తుంటారు. అయితే మీకు మార్కెట్లపై మంచి అవగాహన వస్తే అదిరిపోయే రిటర్న్స్ సొంతం చేసుకోవచ్చు. దీని కోసం మార్కెట్లను జాగ్రత్తగా గమనిస్తుండాలి. ఆయా కంపెనీలపై అధ్యయనం చేయాలి. కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, పెట్టుబడి వ్యూహాలు, ప్రణాళికలు ఇలా అన్నింటినీ గమనిస్తుండాలి. తర్వాత స్టాక్ గమనాన్ని బట్టి ఆర్థిక నిపుణుల సలహా తీసుకొని ఇన్వెస్ట్ చేస్తుండాలి. అప్పుడు మీకు దీర్ఘకాలంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదో తొందరలో డబ్బులు పెడితే మాత్రం పోగొట్టుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయనేది గుర్తుంచుకోవాలి.

ఇక దలాల్ స్ట్రీట్‌లో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించే స్టాక్స్ చాలానే ఉంటాయి. వీటిని కనిపెట్టడమే కాస్త కష్టం. అయితే ఒక్కసారి వీటిని కనిపెట్టి చిన్న మొత్తాల్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతే మంచి లాభాలు ఆశించవచ్చు. ఇక అలాగే ఇన్వెస్టర్ల తలరాతను మార్చిన ఒక టాటా స్టాక్ గురించి చూద్దాం.

ఇన్ఫోసిస్‌కు మరో బంపర్ ఆఫర్.. ఏకంగా రూ. 19 వేల కోట్ల డీల్ పట్టేసిందిగా.. ఇంకేం తిరుగులేదా?

దివాలా అంచు నుంచి ఆర్థిక శక్తిగా.. 76 ఏళ్లలో భారత్ సాధించిన విజయాలివే

అదే టాటా మోటార్స్. ఈ స్టాక్ గత 20 ఏళ్లలో ఇన్వెస్టర్లకు లక్షల్లో లాభం ఇచ్చింది. ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర రూ.606.80 వద్ద ఉంది. గత రెండు దశాబ్దాల్లో ఏకంగా 1370 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అంటే 20 ఏళ్ల కిందట మీరు ఇందులో రూ. లక్ష పెట్టుబడి పెట్టినట్లయితే సంపద ఏకంగా రూ. 15 లక్షలయ్యేది. ఇక రూ.10 వేల పెట్టుబడిని రూ. 2.40 లక్షలు చేసేది. ఈ స్టాక్ మున్ముందు కూడా మంచి పనితీరు కనబరిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇక గడిచిన 5- 10 సంవత్సరాల్లో ఈ స్టాక్ భారీగా పెరిగింది. గత ఐదేళ్లలో ఏకంగా 144 శాతం రిటర్న్స్ ఇచ్చింది. టాటా మోటార్స్.. ముఖ్యంగా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లలో టియాగో, ఆల్ట్రోజ్, ట్రిగోర్ మోడల్ కార్లు, SUV సెగ్మెంట్లలో సఫారీ, నెక్సాన్, హ్యారియర్ మోడల్స్‌ కస్టమర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పటి నుంచి స్టాక్ మరింత జోరు అందుకుంది.

ఇటీవల కంపెనీ ఫలితాల్లో కూడా దుమ్మురేపింది. ఏడాది కిందట ఇదే సమయంలో రూ.5007 కోట్ల నష్టాన్ని ప్రకటించగా.. ఈసారి మాత్రం రూ. 3023 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇక ఆపరేషన్స్ రెవెన్యూ ఏకంగా 42 శాతం పెరిగి రూ. 1.02 లక్షల కోట్లకు చేరింది.

కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన 5 బ్యాంకులు ఇవే.. ఒక్క నెలలోనే ఇలా చేశాయేంటి?

యూట్యూబ్‌లో మీకు పదే పదే ఆ వీడియోలు కనిపిస్తున్నాయా? వీటిని ఆపేదెలా.. ఇక్కడ చూద్దాం!

Read Latest

Business News and Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *