APSRTC :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC).. విజయనగరం జోన్ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్ శిక్షణకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 15న ముగిసింది. ఇక.. ఆగస్టు 18 నుంచి ధృవపత్రాల పరిశీలన ప్రారంభం కానుంది.
విజయనగరం జోన్ పరిధిలోని జిల్లాలు:
తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం, మన్యం పార్వతీపురం, శ్రీకాకుళం.
ట్రేడులు:
డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెషినిస్ట్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ వర్కర్, మిల్ రైట్ మెకానిక్ ట్రేడుల్లో ఈ ఖాళీలున్నాయి.
అర్హత:
అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం:
విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది:
ఆగస్టు 15, 2023
తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేది: 18.08.2023.
విశాఖపట్నం,అనకాపల్లి, సీతారామరాజు జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేది: 19.08.2023.
శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల ధ్రువపత్రాల పరిశీలన తేది: 21.08.2023.
ధ్రువపత్రాలు పరిశీలించే స్థలం:
ఆర్‌టీసీ, జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలే జ్, వీటీ అగ్రహారం, విజయనగరం.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: