దూరవిద్య ద్వారా చదువుకోవాలనుకునే హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar Open University) డిగ్రీ, పీజీ, పీజీ డిప్లమా మరియు సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. 2023-2024 సంవత్సరానికి గానూ ప్రవేశాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. అండర్ గ్రాడ్యుయేట్, పీజీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు కావాల్సిన అర్హతలు, దరఖాస్తు వివరాలు, ముఖ్యమైన తేదీలను వెల్లడించింది. దరఖాస్తులకు చివరి తేదీని మొదట జులై 31గా నిర్ణయించగా.. దీనిని మరో రెండు వారాలు పొడిగించారు. అంటే ఆగస్టు 16న అడ్మిషన్ల దరఖాస్తులకు చివరి తేదీగా పేర్కొన్నారు. నేటితో వీటి దరఖాస్తుల ప్రక్రియ కూడా ముగియనుంది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు.. పీజీలో ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ కోర్సులతో పాటు పీజీ డిప్లొమాలో బీఎల్‌ఐఎస్సీ (BLISc), ఎంఎల్‌ఐఎస్సీ (MLISc) సహా పలు సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో దరఖాస్తులు సమర్పించవచ్చు.
దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలో స్వీకరిస్తోంది. దరఖాస్తుల స్వీకరణ జూన్ 14 నుంచి ప్రారంభం అవ్వగా.. ఆగస్టు 16వ తేదీతో ముగియనుంది. మరిన్ని వివరాలను https://www.braouonline.in/ వెబ్‌సైట్‌లో పొందవచ్చు. బీఏ, బీకాం, బీఎస్సీ – తెలుగు / ఇంగ్లిష్ మీడియం, బీఏ, బీఎస్సీ – ఉర్దూ మీడియంలలో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇక పీజీ కోర్సులైన ఎంఏ / ఎంఎస్సీ / ఎంకాంలకు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతను అర్హతగా పేర్కొంది. ఇవి కూడా తెలుగు, ఇంగ్లిష్ మీడియంలలో ఉన్నాయి. మరిన్ని వివరాలకు వర్సిటీ హెల్ప్‌లైన్ నెంబర్లు 7382929570, 7382929580, 7382929590 & 7382929600లకు కాల్ చేయాలని సూచించారు.
కోర్సులు : డిగ్రీ కోర్సులు B.A., B.Com., B.Sc..
పీజీ కోర్సులు : M.A., M.Com., M.Sc., M.B.A., BLISc., M.LISc., P.G. డిప్లొమా
మరియు వివిధ సర్టిఫికెట్ కోర్సులు
దరఖాస్తు పద్ధతి : ఆన్లైన్
దరఖాస్తు రుసుము చెల్లింపు పద్దతి : క్రెడిట్/డెబిట్ కార్డు ద్వారా ఏపీ, టీఎస్ ఆన్లైన్ సెంటర్ ల ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు ప్రారంభ తేదీ : జూన్ 14,2023
దరఖాస్తు చివరి తేదీ : ఆగస్టు 16, 2023
పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
వీటితో పాటే.. యూజీ సెకండ్ అండ్ థర్డ్ ఇయర్ ట్యూషన్ ఫీని.. పీజీ సెకండ్ ఇయర్ ఫీ పేమెంట్ కు చివరి తేదీ కూడా ఆగస్టు 16, 2023గా పేర్కొన్నారు. తొలుత జులై 31 చివరి తేదీగా నిర్ణియించగా.. మరో 16 రోజుల గుడువును పొడిగించారు. వీటికి కూడా నేటితో ఫీ పేమెంట్ గడువు ముగియనుంది.