Fever : జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయాలా.. వద్దా..

జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయడానికి చాలా మంది ఇష్టపడరు. స్నానం చేస్తే జ్వరం ఎక్కువ అవుతుందని చెబుతున్నారు. దీని గురించి డాక్టర్స్ ఏం చెబుతున్నారో తెలుసుకోండి.

సీజన్‌తో సంబంధం లేకుండా చాలా మంది వైరల్ ఫీవర్ బారిన పడుతున్నారు. చాలా మంది జ్వరం వచ్చినప్పుడు స్నానం చేయరు. జ్వరం తగ్గిన తర్వాతే స్నానం చేయాలి. కానీ, జ్వరం వచ్చినప్పుడు తలస్నానం చేయొచ్చా లేదా అనేది మనలో చాలా మందికి తెలియదు. దీని గురించి వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుందాం.

జ్వరానికి గోరువెచ్చని స్నానం..

వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు స్నానం చేయడానికి ఇష్టపడరు. కానీ, జ్వరంగా ఉన్నప్పుడు కొద్దిగా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిదని గురుగ్రామ్‌లోని నారాయణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఇంటర్నల్ మెడిసిన్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ పంకజ్ వర్మ చెబుతున్నారు.

శరీర అలసట..

ఈ రోజుల్లో వెదర్ చేంజ్ అవుతుంటుంది. ఇలాంటప్పుడు చాలా వరకూ జలుబు, గొంతునొప్పి, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారు. జ్వరం వచ్చినప్పుడు అందరూ అలసిపోతారు. అలాంటి పరిస్తితిలో స్నానం, తినడం వంటి పనులు కూడా చేయలేదు. కేవలం ట్యాబ్లెట్స్ తీసుకోరు. కానీ, స్నానం కచ్చితంగా చేయాలి. ఎందుకంటే..

Also Read : Diabetes Diet : వీటిని తింటే షుగర్ కంట్రోల్ అవుతుందట..

97744670

ఎందుకు స్నానం చేయాలంటే..

వైరల్ ఫీవర్ వస్తే స్నానం కచ్చితంగా చేయాలి. ఎలా చేయాలనేది కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. అయితే, డాక్టర్ పంకజ్ వర్మ ప్రకారం జ్వరం ఉన్నప్పుడు కూడా హాయిగా స్నానం చేయాలి.

ఎందుకంటే ఆరోగ్యం బాలేనప్పుడు సెల్ఫ్ కేర్ అనేది చాలా ముఖ్యం. దీని వల్ల సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. అయితే, స్నానం చేసేటప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయి.

Also Read : Lung Health : ఈ 5 ఫుడ్స్ తింటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..

గోరువెచ్చని నీరు మాత్రమే..

ఎక్కువగా వేడి, చల్లని ఉష్ణోగ్రతల కంటే గోరువెచ్చని నీటిని స్నానం చేయడానికి వాడడం మంచిది. దీంతో శరీరం రిలాక్స్ అవుతుంది. నొప్పులు తగ్గుతాయి. ఒత్తిడి కూడా తగ్గుతుంది.

అయితే, జ్వరం ఉన్నప్పుడు ఎక్కువసేపు కాకుండా కొంచెం టైమ్‌లోనే చేయొచ్చు. ఎక్కువసేపు స్నానం చేస్తే ఫ్లూ పెరిగే అవకాశం ఉంటుంది. బాడీ చల్లగా అవుతుంది. దీంతో పాటు తేలికైన అంటే మైల్డ్ సోప్ వాడండి. దీంతో చెమట, తేమ ఉన్న బాడీ పార్ట్స్‌ని క్లీన్ చేయడం వల్ల సమస్య దూరమవుతుంది. శరీర పరిశుభ్రత పాటించడం వల్ల బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ దూరమవుతాయి.

చల్లని నీరు వద్దు..

అయితే, వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు చల్లని నీటితో స్నానం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే దీని వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి చలి పెరుగుతుంది. జలుబు, ఫ్లూ మళ్ళీ పెరుగుతుంది. అలా అని మరీ వేడి నీరు కూడా వాడొద్దు. దీని వల్ల రక్త నాళాలు విపరీతంగా వ్యాకోచిస్తాయి. రక్తపోటు తగ్గుతుంది. కళ్ళుతిరగడం, మూర్ఛ వంటి సమస్యలొస్తాయి.​

గమనిక:

నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

​​​Read More :

Health News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *