Good News to Women: మహిళలకు శుభావార్త.. జస్ట్ ఏడో తరగతి పాస్ అయ్యి ఉంటే చాలు.. మీకు అదిరిపోయే న్యూస్ ఇది.. సొంత జిల్లాలోనే ఉద్యోగం పొందే ఛాన్స్.. ములుగు జిల్లాలోని మహిళా పిల్లలు దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని చిల్డ్రన్ హోమ్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఉద్యోగాల సంఖ్య, విద్యా అర్హతలు జీతభత్యాలు పూర్తి వివరాలను న్యూస్ 18 మీకోసం అందిస్తుంది. ములుగు జిల్లాలోని చిల్డ్రన్స్ హోమ్ లో ఆఫీస్ ఇంచార్జ్, ఆఫీస్ సబార్డినేట్, సేవిక వంట మనిషి, నైట్ వాచ్మెన్, పారా మెడికల్ స్టాఫ్ మొత్తం 6 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, ఇవి కేవలం అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన ఇంటర్వ్యూ, కంప్యూటర్ టెస్ట్ ద్వారా భర్తీ చేయడం కోసం మహిళ అభ్యర్థుల నుండి అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఉద్యోగాల వివరాలు
ఆఫీస్ ఇంచార్జ్ – 01
అర్హత : సోషల్ వర్క్ / సోషియాలజీ / చైల్డ్ డెవలప్మెంట్ హ్యూమన్ రైట్స్ / పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంశంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ఉద్యోగానికి మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ఉండాలి. నెలకి రూ.33,100 జీతం ఉంటుంది.
ఆఫీస్ సుబార్డినేట్01
అర్హత : ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. తెలుగు భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి. జీతం రూ.6,944 ఉంటుంది
హెల్పర్ 01
అర్హత : ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెలకి జీతం రూ.7,944 ఉంటుంది
నైట్ వాచ్మెన్ 01
అర్హత ఏడవ తరగతి ఉండాలి. మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెలకి జీతం రూ.7,944ఉంటుంది.
పారా మెడికల్ స్టాఫ్01
అర్హత : జనరల్ నర్సింగ్ ఉండాలి. మూడు సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి.
నెలకి జీతం రూ.11,916 ఉంటుంది.
వంట మనిషి : 01
అర్హత : ఏడవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రెండు సంవత్సరాల పని అనుభవం ఉండాలి. నెలకి జీతం రూ.9,930 ఉంటుంది.
ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థులు తగిన విద్య అర్హతలతో ఆగష్టు 17వ తారీకు సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తులను, అన్ని ధృవపత్రాలను గెజిటెడ్ ఆఫీసర్ తో ధ్రువీకరించి ములుగు కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. ఇతర వివరాల కోసం mulugu.telangana.gov.in వెబ్సైట్ ను సందర్శించవచ్చు.
ఇదీ చదవండి : కడపలో ఘనంగా 77 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
అర్హత పొందిన వారికి దరఖాస్తులు వారు తెలిపిన ఫోన్ నెంబర్ కి మెసేజ్ ద్వారా సమాచారం అందించబడుతుంది. ఎలాంటి మెయిల్ కానీ లెటర్స్ కానీ పంపబడవు. ఈ ఉద్యోగ ప్రకటనను ఎలాంటి కారణాలు తెలపకుండా ఏ దశలోనైనా రద్దు చేయవచ్చు లేదా మార్పు చేయు అధికారం జిల్లా కలెక్టర్ కు ఉంటుందని ఉద్యోగ ప్రకటనలో స్పష్టంగా తెలియజేశారు.