Mohan Babu: ఆ మాట వినగానే చెప్పు తీసుకొని కొడతా అన్నా.. మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మోహన్ బాబు (Mohan Babu) తన యూనివర్సిటీలో జెండా పండగ చేశారు. ఈ వేడుకల్లో ఆయన పెద్ద కుమారుడు మంచు విష్ణు కూడా పాల్గొన్నారు. మోహన్ బాబు స్వగ్రామం మోదుగులపాలెం నుంచి గ్రామస్థులు ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వేలాదిగా తరలివచ్చారు. అయితే ఈ వేదికపై మోహన్ బాబు చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. సమాజంలో కుల పిచ్చి ఎక్కువైందంటూ ఓపెన్ గా మాట్లాడారు మోహన్ బాబు.

ఒకప్పుడు మనుషులు కులాలకు అతీతంగా ఉండేవారని.. కానీ ఇప్పుడు కులాల పేరిట తిట్టుకుంటున్నారని మోహన్ బాబు అన్నారు. మనుషుల్లో కుల పిచ్చి ఎక్కువైపోయిందని చెప్పారు. ఎవ్వరినైనా సరే మంచితనం ఆధారంగా గౌరవించాలి అంతేగానీ కులం ఆధారంగా కాదు అని అన్నారు. కుల పిచ్చి వలన అంతా నాశనమే అని మోహన్ బాబు చెప్పారు. చిన్నతనం నుంచే తాను కులాలకు వ్యతిరేకిని అని ఆయన తెలిపారు. చిన్నతనంలో నా మిత్రుడిని కొందరు కులం ఆధారంగా కించపరిస్తే చెప్పుతో కొట్టబోయానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తిరుపతిలోని మోహనబాబు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించానని మోహన్ బాబు తెలిపారు.

నాకు జన్మనిచ్చిన జన్మభూమి మోదుగులపాళెం. ఒక నటుడుగా, ఒక నిర్మాతగా, రాజ్యసభ సభ్యునిగా, విద్యాప్రదాతగా ఎదగడానికి నా తల్లిదండ్రులు, నా గ్రామప్రజలు మూలకారణం. పల్లెటూరు నుండి డిల్లీ పార్లమెంటు వరకు నాప్రస్తానం సాగడానికి నాకు జన్మనిచ్చిన నా పల్లెటూరే కారణం. అంతగొప్పగా ఎదగడానికి మూలమైన నా తల్లిదండ్రులను, జన్మభూమిని, ఆప్తులు, ఆత్మీయులైన మా గ్రామస్తులను ఎప్పుడూ గుర్తుచేసుకుంటూనే ఉంటాను. నాజన్మభూమిని ఎప్పుడూ మనసులో స్మరిస్తూ ఉండాలనే ఉద్దేశ్యంతో ఒక ప్రణాళికను రూపొందించు కున్నాను. నేను స్థాపించిన విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటాలనుకున్నాను అని మోహన్ బాబు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *