Samantha : ‘విజయవాడలో ఇడ్లీ స్టాల్’ అంటూ సమంత వ్యాఖ్యలు.. ఎవర్ని ఉద్దేశించి?

స్టార్ హీరోయిన్ సమంత నిన్న ‘ఖుషి మ్యూజిక్ కాన్సెర్ట్’లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సామ్ మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి. సమంత వ్యాఖ్యలు ఆసక్తికరంగానూ ఉన్నాయి. 

  టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha)  –  డాషింగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) జంటగా నటించిన ఫిల్మ్ ‘ఖుషి’.  మరో పదిహేను రోజుల్లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం యూనిట్ జోరుగా ప్రమోషన్స్ ను నిర్వహిస్తోంది.

  ప్రచార కార్య క్రమాల్లో భాగంగా నిన్న హైదరాబాద్ లోని హెచ్ఐసీసీ సెంటర్ లో నిర్వహించిన ఖుషి మ్యూజిక్ కాన్సెర్ట్ కు సామ్ హాజరైంది. విజయ్ దేవరకొండ తో కలిసి లైవ్ పెర్పామెన్స్ ఇచ్చి యువతను ఉర్రూతలూగించింది. మ్యూజిక్ ఈవెంట్ లో ఆటపాటతో సందడి చేసింది.

అనంతరం సామ్ మాట్లాడింది. సినిమా గురించి చాలా విషయాలు చెప్పింది. ఈ క్రమంలో సామ్ కొన్ని వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ‘దేవుడి దయ వల్ల విజయవాడలో ఇడ్లీ స్టాల్ పెట్టుకునే పరిస్థితి రాలేదు’. అంటూ వ్యాఖ్యానించింది. 

  ఇంతకీ సామ్ ఈ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి చెప్పింది. గతంలో సమంతను ఎవరైనా ఆమె పరిస్థితి బాగోలేనప్పుడు విమర్శించారా? మరెక్కడినుంచైనా ఆమెకు ఇబ్బంది కలిగించే మాటలు వచ్చాయా? అన్నది తెలియడం లేదు. కానీ ఎవరికో కౌంటర్ ఇస్తూనే సామ్ ఇలా మాట్లాడిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

  ఇక సామ్  తన ఆరోగ్య రీత్యా ఏడాది పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సమయాన్ని పూర్తి ఆరోగ్యాన్ని పొందేందుకు వినియోగించుకుంటోంది. దేవాలయాలు, టూర్లకు వెళ్తూ రిలాక్స్  అవుతోంది. రీసెంట్ గా ఫ్రెండ్స్ తో కలిసి ఇండోనేషియాలో సందడి చేసిన విషయం తెలిసిందే.

  ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లోనూ విడుదలవుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించారు. హేషమ్ అబ్దుల్ చిత్రానికి అదిరిపోయే మ్యూజిక్ అందించారు. 

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *