Numerology: పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. వీటి ఆధారంగా సంబంధిత వ్యక్తులకు ఎదురుకాబోయే ప్రమాదాలు, శుభాలను న్యూమరాలజీ (Numerology) నిపుణులు అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం.. నిర్దిష్ట అంకెలు వ్యక్తి గుణగణాల్ని ప్రతిబింబిస్తాయి. ఫలితంగా, కొన్ని అంకెలు కలిగిన వారికి ప్రత్యేక లక్షణాలు అలవడుతాయి. మరికొన్ని అంకెలు లేకపోతే ఆ లక్షణాలను కోల్పోతారు. న్యూమరాలజీలో నంబర్ 6 మిస్ అయితే, ఆ వ్యక్తిపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఈ ప్రభావాన్ని తగ్గించుకోవాలంటే ఎలాంటి పరిష్కార మార్గాలు పాటించాలో ప్రముఖ న్యూమరాలజీ నిపుణురాలు పూజా జైన్(ఫోన్ నెం: +91 90526 47890) వెల్లడించారు.
మిస్సింగ్ నంబర్ 6..
సంఖ్యా శాస్త్రం ప్రకారం నంబర్ 6 శుక్ర గ్రహాన్ని సూచిస్తుంది. ఈ నంబర్ మహిళలకు అత్యంత అవసరమైది. వైవాహిక జీవితంలో ఆనందంగా జీవించడానికి మహిళలకు ఈ నంబర్ తప్పనిసరి. కుటుంబ వృక్షాన్ని పోషించేందుకు మహిళలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలాంటి వారికి నంబర్ 6 ఉండటం అవసరం. పైగా, ఈ అంకె దృఢమైన, ధనిక కుటుంబాన్ని సూచిస్తుంది. నంబర్ 6 లేకపోతే బంధుత్వాలు ఒత్తిడికి లోనవుతాయి. మనసులో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా మాట్లాడేంత వరకు స్నేహంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఇక, పురుషులకు 6వ అంకె ఎంతో అవసరం. పుష్కలమైన అవకాశాలను ఈ అంకె కల్పిస్తుంది. కాబట్టి, సమర్థత ఉన్నా ఈ అంకె లేకపోతే అవకాశాలు తగ్గుతాయి.

ఉదాహరణ..
న్యూమరాలజీ చార్ట్‌లో నంబర్ 6 లేని వ్యక్తికి ఒక ఉదాహరణ చూద్దాం. 1983, ఏప్రిల్ 29 పుట్టిన తేదీ కలిగిన వ్యక్తికి నంబర్ 6 లేదు. ఇలాంటి వారు తమలోని భావాలను ఇతరులతో పంచుకోలేరు. క్రమంగా ఇది జీవితంలో సమస్యగా పరిణమిస్తుంది. ఆ తర్వాత ఈ సమస్యకి సరైన పరిష్కార మార్గం కనుగొంటారు. ఈ వ్యక్తి బాధ్యతలను విస్మరించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇతరులపై ఎక్కువగా ఆధార పడటానికి చూస్తుంటాడు.
Naga Panchami: జాతకాన్ని బట్టి నాగపంచమి రోజు ఈ రాశి వారు ఈ పనులు చేస్తే గ్రహదోషం ఉండదు
లగ్జరీ జీవితం..
సాధారణంగా ఈ అంకె కలిగి ఉన్నవారికి లగ్జరీ దక్కుతుంది. ఒకవేళ నంబర్ 6 లేకపోతే, డబ్బులు ఉన్నా సౌకర్య వంతమైన జీవితం లభ్యం కాదు. కాబట్టి, నంబర్ 6 కోల్పోయిన వారు వీలైనంత ఎక్కువగా ఇతరులకు దానం చేస్తుండటం నేర్చుకోవాలి. మిస్సింగ్ నంబర్ 6 కలిగించే ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి కొన్ని పరిహార మార్గాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం.
చేయాల్సిన పనులు..
1. వెండి చెంచాను ఎక్కువగా వాడితే నంబర్ 6 లేమి ప్రభావాలను క్రమంగా తగ్గించవచ్చు.
2. ఆశ్రమాల్లో చక్కెర దానం చేయండి.
3. మహిళలు తమ మొబైల్ నంబర్ మొత్తం 6 వచ్చేలా చూసుకోవాలి.
4. ప్రతి శుక్రవారం రాధాకృష్ణ భగవానులకు వెండి నాణేన్ని సమర్పించండి.
5. మహిళలు ఎల్లప్పుడూ తమ ఎడమ చేతికి వెండి గాజు ధరించండి.
6. అవసరమైన వారికి పురుషులు కాస్మొటిక్ ప్రొడక్టులను పంపిణీ చేయండి.
7. లక్ష్మీ దేవి సాధన చేయండి.
8. మాంసం, మద్యం, పొగాకు, జంతు చర్మానికి దూరంగా ఉండండి.