వామ్మో.. భూమిలోనుంచి బయటకు వస్తున్న మొసళ్లు

వామ్మో.. భూమిలోనుంచి బయటకు వస్తున్న మొసళ్లు మొసళ్లు అనేవి పెద్ద నదులలో, జలాశయాల్లో ఉంటాయి. కానీ ఓ ఇంటి అడుగు భాగాన ఉన్నాయి. మొదటగాఇంటి అడుగు భాగంనుంచి సగం భాగంపైకి సగం భాగం కిందకి ఉన్న ఒక మొసలిని గమనించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఈ రోజుల్లో ఏ చిన్న విషయం జరిగినా సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచ వ్యాప్తంగా తెలిసిపోతుంది. నిత్యం ఫేస్‌ బుక్‌, ఇన్‌ స్టా గ్రామ్, వాట్సాప్ సహా ఇతర సోషల్ మీడియా మాద్యమాలలో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కొన్ని ఆసక్తికరంగా ఉంటే.. మరి కొన్ని కామెడీగా ఉంటాయి. మరికొన్ని వీడియోలు భయకరంగా ఉంటాయి. మరికొన్నిటిని చూస్తే వామ్మో అనిపించేలా ఉంటాయి.

ఈ వీడియోను చూస్తే కనుక ఓ ఇంట్లో నేలకు పగుళ్లు కనిపించాయి. కాసేపటి తరువాత ఆ పగుళ్ల లోపల ఓ మొసలిని ఆ ఇంటి వారు గుర్తించారు. వెంటనే వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి వచ్చి ఆ మొసలిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. అక్కడ సగభాగం లోపలికి, మరో సగభాగం బయటకు ఉన్న మొసలి కనిపిస్తుంది. అటవీశాఖ అధికారులు ఆ మెసలిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండటాన్ని కూడా వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో  మొసలి కొంచెం కొంచెం బయటకు వస్తుంది. ఇది పూర్తిగా వచ్చే క్రమంలో భూమి లోపల నుంచి మరో మొసలి కూడా బయటకు వచ్చింది. అలా ఒక్కసారిగా మరో మొసలి బయటకు వచ్చింది. దీంతో అక్కడున్న వారంతా భయంతో కంపించిపోయారు.

 ఒక మొసలి మాత్రం ఉంది అనుకున్న వారికి రెండవ మొసలి ఊహించని షాక్‌ ఇచ్చింది.   దానిని చూసిన అక్కడున్న జనం భయపడటాన్ని గమనించవచ్చు. ఇలా మరో మొసలి కూడా లోపలి నుంచి వస్తుందని అక్కడున్నవారెవరూ ఊహించలేరు. ఆ మొసళ్లు అక్కడున్నవారిని అమాంతం మింగేద్దామనే రీతిలో బయటకు వచ్చాయి. అయితే అక్కడున్న అధికారులు ఆ మొసళ్లను పట్టుకుని సురక్షిత ప్రాంతాల్లో వదిలివేశారు. 

రెండవ మొసలి అక్కడ ఉన్న వారిని మింగేయాలి అనేలా ఆ మొసలి బయటకు వచ్చింది. దీంతో అక్కడ ఉన్న వారిలో కొంత మంది పక్కనే ఉన్న గోడ మీదకి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. అటవీ అధికారులు రెండు మొసళ్లను పట్టుకుని వెళ్లిపోయారు. అయితే ఈ వీడియో ఎక్కడిది, ఎప్పటిది అనేది మాత్రం తెలియలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతుంది.  ఈ వీడియోను ట్విట్టర్లో @Figen అనే అకౌంట్లో షేర్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ ( వార్త రాసే సమయానికి) 2.2 మిలియన్ల వ్యూస్ దక్కగా, 26 వేలమంది వీడియోను లైక్ చేశారు. అలాగే పలువురు యూజర్లు కామెంట్లు కూడా చేశారు. ఈ వీడియో నమ్మశక్యంగా లేదని ఒక యూజర్ పేర్కొనగా, మరొక యూజర్ ఇక్కడేం జరుగుతోంది అని రాశారు.

©️ VIL Media Pvt Ltd.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *