Bedurulanka Movie | యుగాంతం వలయంలో బెదురులంక.. ఆసక్తిరేకెత్తిస్తున్న ట్రైలర్‌

Bedurulanka Movie Trailer | యదార్థ సంఘటనల ఆధారంగా అని కనిపిస్తే చాలు సినీ లవర్స్‌లో ఎక్కడలేని ఆసక్తి క్రియేట్‌ అవుతుంది. అలాంటి కథలకు కాస్త క్రియేటివిటీ తోడైతే బాక్సాఫీస్‌ దగ్గర వండర్స్‌ క్రియేట్‌చ చేయోచ్చు. ప్రస్తుతం అలాంటి కథతో వస్తున్న సినిమా బెదురులంక 2012. ఆర్‌ఎక్స్‌100 హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు క్లాక్స్‌ దర్శకుడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన యుగాంతం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. బెదురలంక అనే ఊర్లో చోటు చేసుకున్న వింత పరిణామాలను తెరపై చూపించబోతున్నట్లు ఇప్పటికే టీజర్‌తో దర్శకుడు క్లాక్స్‌ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఆగస్టు 25న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది. ఇక తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు.

ట్రైలర్‌తోనే సినిమాపై ఓ క్లారిటీ వచ్చేసింది. యుగాంతం గురించి భయపడుతున్న బెదురలంక ప్రజలను కొందరు మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తుంటారు. వాటి నుంచి ప్రజలు తప్పించుకుంటారా? యుగాంతం వాళ్ల జీవితాలలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? అనే విధంగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా యుగాంతం చుట్టు జరిగిన పరిణామాలను క్లాక్స్ సర్కాస్టిక్‌గా, హ్యూమరస్‌గా చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో స్పష్టమయింది. ట్రైలర్‌ మొత్తం ఫన్నీగానే సాగింది. కార్తికేయ, నేహాశర్మ కెమెస్ట్రీ కూడా బాగానే వర్కవుట్ అయినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉంది.

మొత్తంగా చూసుకుంటే మంచి కంటెంట్‌ బొమ్మ రానున్నట్లే తెలుస్తుంది. వచ్చే వారం పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవి రాకపోవడం ఈ సినిమాకు కలిసొచ్చే అంశమే. అయితే ఈ సినిమా రిలీజైన వారానికే ఖుషీ వస్తుంది. ఇప్పటికే ఈ సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ ఉంది. కాబట్టి వారంలోపై వీలైనన్ని కలెక్షన్‌లు సాధించాల్సి ఉంటుంది. లౌక్య ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై రవింద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *