అలా అయితే నేనే రంగంలోకి దిగుతా.. చక్రం తిప్పేందుకు కేసీఆర్ ‘వ్యూహం’తో సిద్ధం..!

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక వ్యూహాలు సిద్ధం చేసిన గులాబీ బాస్ కేసీఆర్.. మరో ప్రయాణానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జమిలీ ఎన్నికల అంశం తెరమీదికి రావటంతో.. అందుకు కూడా తనదైన వ్యూహాన్ని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఈ నెల 18వ తేదీ నుంచి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తమ పార్టీ ఎంపీలకు పలు కీలక సూచనలు చేశారు. ఇవాళ ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ రాజ్యసభ, లోక్ సభ ఎంపీలతో కేసీఆర్ భేటీ కాగా.. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.

అయితే… ఈ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాలు తీసుకునే అకాశం ఉందని.. చాలా వార్తలు ప్రచారమవుతున్నాయి. జమిలీ ఎన్నికలపై కేంద్రం సంచలన నిర్ణయాలు తీసుకుంటుందన్న అంచనాలు కూడా వేస్తున్నారు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇలాంటి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే మాత్రం.. తానే స్వయంగా రంగంలోకి దిగుతానని.. ఢిల్లీకి వస్తానంటూ.. ఎంపీలకు కేసీఆర్ తెలిపారు. అయితే.. ఒకవేళ జమిలి ఎన్నికలపై ఏమైనా నిర్ణయాలు వస్తే మాత్రం అందుకు తగ్గట్టుగా.. హస్తినలో చక్రం తిప్పేందుకు వ్యూహాలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక, ఎన్నికలు వేర్వేరు వచ్చినా.. జమిలీ వచ్చినా బీఆర్ఎస్‌దే విజయమని కేసీఆర్ దీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ విజయంపై ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని కేసీఆర్ ఎంపీలకు ధైర్యం ఇచ్చారు. మరోవైపు.. మహిళ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ బిల్లులను పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో పెట్టి ఆమోందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ రెండు అంశాల్లో ప్రతిరోజు పార్లమెంట్‌ సమావేశాల్లో గళం వినిపించాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు.. ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖలు కూడా రాశారు.

103690605

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *