బాదంలో మన ఆరోగ్యానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిని తింటే మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అంతేకాదు ఇది మన చర్మానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
మనం తినే ఆహారాలు మన ఆరోగ్యానికే కాదు మన చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. ఇలాంటి వాటిలో బాదం పప్పు ఒకటి. అవును బాదం మన చర్మ ఆరోగ్యానికి మంచి ఆహారం అన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. బాదం పోషకాల బాంఢాగారం. దీనిలో ఉండే విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, హెల్తీ ఫ్యాట్స్ చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. బాదం పప్పులను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని ఫేస్ ప్యాక్ లేదా బాదం నూనెను ఉపయోగించడం వల్ల మీ స్కిన్ కలర్ మెరుగుపరడుతుంది.
బాదంలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ముఖంపై ముడతలు, డార్క్ సర్కిల్స్ ను, వయసు రీత్యా వచ్చే మచ్చలను తగ్గిస్తుంది. బాదం పప్పులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వయసు పెరిగే కొద్దీ చర్మంపై కనిపించే సన్నని గీతలు, ముడతలు ఏర్పడటం చాలా వరకు తగ్గుతుంది. దీనిలో ఉండే లినోలెయిక్ ఆమ్లం చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి.
బాదం పప్పులను తినడం వల్ల మీ చర్మం అందంగా, కాంతివంతంగా మారుతుంది. బాదం చర్మ నష్టాన్ని నివారిస్తుంది. అలాగే చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. బాదం పప్పులో లినోలెయిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు ఆమ్లం. ఇది మన చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. బాదం చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. దీంతో మన చర్మం చాలా అందంగా, మృదువుగా మారుతుంది.
బాదం మోనోశాచురేటెడ్, పాలీ అన్శాచురేటెడ్ కొవ్వులతో పాటుగా ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పుల్లో సెలీనియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం అందంగా కనిపించేలాచేస్తుంది. దీనిలోని జింక్ చర్మ సమస్యలను తొందరగా తగ్గిస్తుంది.
బాదం పప్పుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. దీనిలోని జింక్ చర్మంపై ఎరుపును, మొటిమలను త్గగిస్తుంది. అలాగే చర్మశోథ, తామర వంటి కొన్ని చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడానికి బాదం పప్పును నానబెట్టి లేదా అలాగే తినొచ్చు.