ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రూ.11 వేలు తగ్గింపు.. రోజుకు రూ.170 కడితే మీ సొంతం!

Electric Scooter: మీరు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు సిద్ధమవుతున్నారా? అయితే.. మీకో అదిరే శుభవార్త. భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ఏకంగా రూ.11 వేల వరకు తగ్గింపు అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాలం ఆఫర్ మాత్రమే నని గుర్తుంచుకోవాలి. కొత్తగా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనే వారు ఈ డీల్‌ను ఒకసారి పరిశీలించొచ్చు.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మ్యాగ్నస్ మోడల్‌పై ఈ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1,04,900గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 93,900కే కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు దాదాపు రూ.11 వేల తగ్గింపు పొందవచ్చు. కొత్త స్కూటర్ కొనుగోలు చేయాలని చూస్తున్న వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. మళ్లీ ఇందులో కూపన్ డిస్కౌంట్ కింద రూ.4 వేలు ఉంటుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్నట్లయితే రూ. 7 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై నో కాస్ట్ ఈఎంఐ సౌలభ్యం కూడా ఉంది. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 17,483 పడుతుంది. అదే రెగ్యులర్ ఈఎంఐ అయితే నెలకు రూ. 5,136 అంటే రోజుకు దాదాపు రూ.170 కట్టాల్సి ఉంటుంది. దీనికి 24 నెలల టెన్యూర్‌కు ఇది వర్తిస్తుంది. అదే 18 నెలల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 6,600 చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది పాటు టెన్యూర్ ఉన్నట్లయితే నెలకు రూ. 9,500 కట్టాలి. 9 నెలల టెన్యూర్ అయితే నెలకు రూ. 12,500 చెల్లించాలి.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 100 కిలోమీటర్ల వరకు వెళ్లొచ్చు. రెడ్, బ్లాక్, గ్రే, వైట్, బ్లూ అనే రంగుల్లో ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 10 సెకన్లలో అందుకుంటుంది. పవర్ ఫుల్ హబ్ మోటార్, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్‌పై మూడేళ్ల వరకు వారంటీ లభిస్తుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 50 కిలోమీటర్లు. ఛార్జింగ్ టైమ్ 6 నుంచి 7 గంటలు పడుతుంది. మీరు కంపెనీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి కూడా కొనొచ్చు.

Read Latest

Business News and Telugu News

103527953

103549681

103554304

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *