ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై మరణించింది. అయితే ఈ ప్రమాదంపై దర్యాప్తు చేయడానికి వచ్చిన అక్కడి పోలీసుల అధికారి డేనియల్ అడెరెర్ ప్రవర్తించిన తీరు, వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఆయన జాహ్నవి మరణం గురించి చాలా చులకనగా మాట్లాడారు. ఇదంతా అతని బాడీ కెమెరాలో రికార్డు అయి, తాజా బయటకు వచ్చాయి. దీంతో భారత్ లో అతడిపై ఆగ్రహం వ్యక్తం అయ్యింది. దీంతో అతడిపై చర్యలు తీసుకోవాలని భారత్ అమెరికాను డిమాండ్ చేసింది. కాగా.. ఈ కేసులో తాజాగా కీలక విషయం బయటకు వచ్చింది. ఆ వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేయలేదని ఆ పోలీసు ఆఫీసర్ డేనియల్ అడెరెర్ పేర్కొన్నారు. కాగా.. ఈ వివాదానికి కేంద్ర బిందువైన డేనియల్ కు అక్కడి పోలీసులు సపోర్ట్ గా నిలిచారు.
భావ ప్రకటనా స్వేచ్ఛ విద్వేషపూరిత ప్రసంగంగా మారకూడదు – సనాతన ధర్మం వివాదంపై మద్రాస్ హైకోర్టు
కందుల జాహ్నవి నార్తీస్ట్రన్ విశ్వవిద్యాలయంలోని సీటెల్ క్యాంపస్‌లో ఆమె మాస్టర్స్ చదువుకునేందుకు అమెరికాకు వెళ్లారు. అయితే ఈ ఏడాది జనవరి 23వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆమెను ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలతో ఆమె అక్కడే చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే.. దానిని దర్యాప్తు చేసేందుకు డేనియల్ అడెరెర్ అనే పోలీసులు అధికారి అక్కడికి వచ్చారు. జాహ్నవి మరణాన్ని హేళన చేస్తూ మాట్లాడాడు. ఆమె ఓ సాధారణ మనిషి అని, ఆమె మరణానికి విలువ లేదని, ఆమెకు 26 ఏళ్ల వయస్సు ఉండొచ్చని పేర్కొన్నారు. ఓ 11 వేల డాలర్ల చెక్కు రాయాలని ఆయన ఎవరితోనో ఫోన్ లో సంభాషించాడు. అయితే ఇదంతా అతడి బాడీ కెమెరాలో రికార్డు అయ్యింది.
ఔరంగాబాద్, ఉస్మానాబాద్ జిల్లాల పేర్లు మార్చిన మహా సర్కార్.. ఇక నుంచి వాటిని ఏమని పిలవాలంటే ?
ఇది బయటకు రావడంతో వైరల్ గా మారింది. భారత్ తో పాటు అటు అమెరికాలో ఉన్న భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో భారత ప్రభుత్వం కూడా స్పందించింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికాను డిమాండ్ చేసింది. అయితే ఈ వివాదంపై అక్కడి ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అనంతరం దీనిపై అక్కడి సియాటెల్ పోలీసు ఆఫీసర్ల నుంచి ఓ ప్రకటన వెలువడింది. జాహ్నవి మరణంపై వైరల్ అయిన వ్యాఖ్యలు డేనియల్ అడెరెర్ చేసినవే అని, కానీ అవి ఒక వైపు మాత్రమే వినిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆయన ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో అతడి బాడీ కెమెరాలో రికార్డయిన మాటలు అవన్నీ అని తెలిపారు. అసలు పూర్తిగా ఏం జరిగిందో ప్రజలెవరికీ తెలియదని పేర్కొన్నారు. అవి తెలియజేయడంలో కూడా సోషల్ మీడియా ఫెయిల్ అయ్యింది అంటూ ఆ అధికారికి సపోర్ట్ చేస్తూ గిల్డ్ ప్రకటన వెలువడింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న ట్రక్కును ఢీకొన్న కారు.. నలుగురు మృతి
ఇదిలా ఉండగా.. వివాదాస్పద ఘటనపై డేనియల్ పై ఆఫీసర్లకు రాసిన లేఖను కూడా గిల్డ్ వెలువరించింది. ఆ లేఖలో డేనియల్.. తాను లాయర్లను ఉద్దేశించే అలా మాట్లాడానని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కోర్టులో లాయర్లు ఎంత హాస్యాస్పదంగా మాట్లాడుతారో గుర్తొచ్చాయని, అందుకే తనకు అలా నవ్వొచ్చిందని చెప్పారు. ఆ రోజు ప్రమాదంపై సమాచారం అందగానే హెల్ప్ చేసేందుకు వెళ్లానని, అయితే తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు తన సహోద్యోగికి ఫోన్ చేశానని తెలిపారు. అప్పటికే తన డ్యూటీ పూర్తయ్యిందని, కానీ బాడీ కెమెరా ఆఫ్ చేయలేదనే విషయం తాను మర్చిపోయానని చెప్పారు.
పట్టాలెక్కనున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ స్లీపర్ వెర్షన్.. ఎప్పటి నుంచి అంటే ?
తన సహోద్యోగితో పర్సనల్ గా మాట్లాడిన విషయాలు ఆ బాడీ కెమెరాలో రికార్డు అయ్యాయని పేర్కొన్నారు. అందులో కూడా తాను లాయర్లు కోర్టులో ఎలా వాదిస్తారనే విషయంపైనే చర్చించానని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు లాయర్లు మనిషి ప్రాణానికి ఉన్న విలువ గురించి ఎలా మాట్లాడుతారో చెప్పానని తెలిపారు. ఇలాంటి ఘటనల సమయంలో నష్టపరిహారం కోసం ఎలా బేరసారాలు సాగిస్తారో తాను గతంలో చాలా సార్లు చూశానని, అవి గుర్తు రావడం వల్లే తనకు నవ్వు వచ్చిందని పేర్కొన్నారు. అంతేగాని జాహ్నవిని అవమానించే విధంగా తాను కావాలని అలా మాట్లాడలేదని చెప్పారు. పూర్తిగా వివరాలు తెలియకపోతే ఇలాంటి ప్రమాదకరమైన ఊహాగానాలే బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు. దీనిపై నిజాయితీగా దర్యాప్తు జరపాలని ఆయన అధికారులను ఆ లేఖలో కోరారు. అప్పుడు తనకు ఏ శిక్ష పడినా.. దానిని ఎదుర్కొంటానని చెప్పారు.