గుడ్‌న్యూస్.. ఒకేసారి 9 వందే భారత్ రైళ్లు ప్రారంభం.. ఈ రూట్లలోనేనా?

Vande Bharat: రైల్వే ప్రయాణికులకు అదిరే గుడ్‌న్యూస్. దేశంలో అత్యంత పాపులర్‌గా మారిన వందే భారత్ రైళ్లను వేగంగా పట్టాలెక్కిస్తోంది రైల్వే శాఖ. మరి కొద్ది రోజుల్లోనే మరో ఒకేసారి ఏకంగా 9 వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఏ రూట్లలో ఇవి రాబోతున్నాయో ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Vande Bharat: రైలు ప్రయాణికుల కష్టాలు తీర్చేందుకు భారతీయ రైల్వే వేగంగా చర్యలు చేపడుతోంది. వందే భారత్ పేరుతో ఎక్స్‌ప్రెస్ రైళ్లను పట్టాలెక్కిస్తోంది. ఇప్పటికే పలు మార్గాల్లో ఈ రైళ్లు సేవలందిస్తున్న విషయం తెలిసింది. మరికొద్ది రోజుల్లోనే ఏకంగా ఒకేసారి 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది రైల్వే శాఖ. ఈ 9 రైళ్లు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు మరింత మేలు జరగనుంది. వేగంగా తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీలు పడుతుంది. చివరి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును జులై 7న ప్రారంభించింది రైల్వే శాఖ. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఎక్కడా కొత్త వందే భారత్ రైలు పట్టాలెక్కలేదు. ఆ తర్వాత పలు రూట్లో కొత్త వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోందన్న వార్తలు చక్కర్లు కొడుతున్నా.. రైల్వే శాఖ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే మరోసారి భారతీయ రైల్వే దూకుడుగా వందే భారత్ రైళ్లను ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. ఈసారి ఏకంగా 9 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో పలు రూట్స్ కూడా దాదాపుగా కన్ఫామ్ అయ్యాయటా.

కన్ఫామ్ అయిన రూట్లు ఇవేనా?

ఇప్పటి వరకు కన్ఫామ్ అయిన రైల్వే మార్గాలను పరిశీలిస్తే అందులో ఇండోర్ – జైపూర్, జైపూర్- ఉదయ్‌పూర్, జైపూర్- చండీగఢ్, పూరి- రౌర్కెలా, పాట్నా- హౌరా రూట్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మార్గాల్లోనే వచ్చే వందే భారత్ రైళ్లు పరుగులు పెట్టబోతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. పూరి- రౌర్కెలా వందే భారత్ రైలు సెప్టెంబర్ 30న ప్రారంభం కానుందని తెలుస్తోంది. మిగతా నాలుగు రూట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది.

తెలుగు రాష్ట్రాలకు ఓ రైలు..

ఈ 9 రైళ్లలో ఒక రైలును సౌత్ సెంట్రల్ రైల్వేకు కేటాయించారని సమాచారం. ఈ రైలును చెన్నై- విజయవాడ రూట్‌లో తిరుపతి మీదుగా నడిపే అవకాశం ఉందటా. ఇక కాచిగూడ- యశ్వంత్‌పూర్ మార్గంలో కూడా మరో వందే భారత్ రైలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి. కాచిగూడ- యశ్వంత్‌పూర్ వందే భారత్ రైలు కర్ణాటక ఎన్నికల సమయం నుంచి పెండింగ్‌లోనే ఉన్న సంగతి తెలిసిందే.

ఆ ఫ్యాక్టరీలోనే తయారీ?

చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలోనే ఈ తొమ్మిది వందే భారత్ రైళ్లను తయారు చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం దేశ వ్యాప్తంగా పలు మార్గాల్లో 25 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. ఈ రైళ్లు ప్రతీ రోజూ 50 సర్వీసుల్ని అందిస్తున్నాయి. కొన్ని మార్గాల్లో ఈ రైళ్లు వారానికి ఆరు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోని ఈ మార్గాల్లో కొత్త రైళ్లు..

తెలుగు రాష్ట్రాలను కవర్ చేస్తూ ఇప్పటికే సికింద్రాబాద్- విశాఖపట్నం, సికింద్రాబాద్- తిరుపతి రూట్లలో వందే భారత్ రైళ్లు సేవలందిస్తున్నాయి. విజయవాడ- చెన్నై, నాగ్‌పూర్- హైదరాబాద్, సికింద్రాబాద్- భువనేశ్వర్, సికింద్రాబాద్- పూణె, కాచిగూడ- యశ్వంత్‌పూర్ రూట్లలో వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *